హైదరాబాద్

‘డబుల్’ ఇళ్లకు సరికొత్త టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. త్వరలోనే లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి, లబ్ధిదారులకు అందించనున్నట్లు మున్సిపల్ మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనతో పనులు జోరుగా సాగుతున్నాయి. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు షీర్‌వాల్ అనే సరికొత్త టెక్నాలజీని అమలు చేస్తున్నారు. రాంపల్లిలో 6240, కొల్లూరులో 15600, అహ్మద్‌గూడలో 4428, మనగనూరులో 2700, ఫీర్జాదిగూడలో 2200, భోజగుట్టలో 1824, జియాగూడలో 840 ఇళ్ల నిర్మాణానికి ఇదే టెక్నాలజీని వినియోగించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. గ్రేటర్‌లోనే అతిపెద్ద డబుల్ బెడ్‌రూం కాలనీగా అవతరించనున్న కొల్లూర్‌లో మొత్తం 124 ఎకరాల స్థల విస్తీర్ణంలో రూ.1355 కోట్ల వ్యయంతో స్టిల్ట్ ప్లస్ 11 అంతస్తుల్లో 15660 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్నారు. నాణ్యతతో, వీలైనంత త్వరగా పనులను ముగించేలా చర్యలు చేపట్టారు. ఇళ్లతో పాటు కనీస వౌలిక వసతులైన పోలీస్‌స్టేషన్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంక్, కమ్యూనిటీ సెంటర్లు, పార్కులు, ప్లేగ్రౌండ్స్, భూగర్భ డ్రైనేజీ, అంతర్గత సిటీ రోడ్ల నిర్మాణాలతో పాటు వివిధ మతాలకు చెందిన ప్రార్థన మందిరాలను కూడా నిర్మించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అత్యాధునిక షీర్‌వాల్ టెక్నాలజీతో చేపడుతున్న కొల్లూర్ డబుల్ బెడ్ రూం కాలనీని మరో సంవత్సరంలోపు పూర్తి చేసేలా ప్రణాళికలను తయారు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. కొల్లూరును మున్సిపాలిటీగా రూపొందనున్నట్లు వెల్లడించారు.
రెండో మెగా ‘డబుల్’ప్రాజెక్ట్
రాంపల్లి రెండో మెగా డబుల్ బెడ్‌రూం ప్రాజెక్ట్ పనులను అధికారులు ప్రారంభించారు. ఇక్కడ మొత్తం 41 ఎకరాల్లో సుమారు రూ.542 కోట్ల వ్యయంతో 52 బ్లాకుల్లో 6264 ఇళ్లను నిర్మించనున్నారు. షీర్‌వాల్ టెక్నాలజీతో వేగంగా అంటే కేవలం 48 గంటల్లోనే ఒక అంతస్తు నిర్మాణం చేపట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బహుళ అంతస్తు భవనానికి ఏర్పాటు చేసే మెట్లను కూడా ప్రీకాస్ట్ పద్ధతిలో తయారు చేస్తున్నారు. ఇక్కడ స్టిల్ట్ ప్లస్ పది అంతస్తుల్లో 198440 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కాలనీకి సంబంధించి ఇప్పటి వరకు 33 బ్లాకుల్లో పుట్టింగ్‌లు పూర్తయ్యాయి.
అహ్మద్‌గూడలో..
నగరంలోని శేరిలింగంపల్లిలోని అహ్మద్‌గూడలో రూ.383 కోట్ల వ్యయంతో నిర్మించునున్న 4428 ఇళ్లకు కూడా ఈ సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇక్కడ చేపడుతున్న ప్రాజెక్ట్ గ్రేటర్‌లోని డబుల్ కాలనీలో మూడో స్థానంలో ఉంది. ఇక్కడ 41 బ్లాకుల్లో సెల్లార్, స్టిల్ట్‌లతో తొమ్మిది అంతస్తుల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇక్కడ నిర్మించే ఒక్కో యూనిట్‌కు రూ.8.65 లక్షలను వెచ్చిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి 60శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 20.73 ఎకరాల స్థలంలో ఇళ్లను సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నారు.