హైదరాబాద్

మల్టీలెవెల్ కారు పార్కింగ్ కాంప్లెక్స్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న అక్రమ పార్కింగ్‌కు చెక్ పెట్టడంతో పాటు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు నగరంలో మల్టీలెవెల్ కారు పార్కింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించనున్నట్లు మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ వెల్లడించారు. నగరంలో ప్రజాజీవనాన్ని ప్రభావితం చేసే వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో గురువారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. మల్టీలెవెల్ కారు పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి వివిధ శాఖలు తమ అవసరాలను పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు సిద్దం చేసి, సర్కారుకు పంపాలని ఆదేశించారు. ఆయా శాఖకు చెందిన సంబంధించిన ఖాళీ స్థలాలను కూడా గుర్తించి, వివరాలను పంపాలని సూచించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎక్కువ అవసరాలున్న హైదరాబాద్ మెట్రోరైలు ఇతర శాఖలతో సమన్వయకర్తగా వ్యవహారించనున్నట్లు తెలిపారు. నగరంలో నిర్మించనున్న అన్ని మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లను రాష్ట్ర పోలీసు శాఖ అమలు చేస్తున్న స్మార్ట్ పార్కింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కింద నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
సమావేశంలో భాగంగా హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ డా.ఎన్వీఎస్ రెడ్డి.. మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల ప్రయోజనాలను వివరించారు. కాంప్లెక్స్‌లను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) ప్రాతిపదికన అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు పంపే ప్రతిపాదనలు, ఖాళీ స్థలాలను తొలి దశగా నగరంలో 30 నుంచి 40 వరకు ఈ పార్కింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సమావేశానికి అడిషనల్ డీజీపీ జితేందర్, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, న్యాయశాఖ అదనపు కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ పాల్గొన్నారు.