హైదరాబాద్

ఓటుకు 5 లక్షల రూపాయలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల సునాయాస విజయానికి ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో ఆరు స్థానాలు టిఆర్‌ఎస్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడంతో మిగిలిన ఆరు స్థానాలను కూడా తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే విధంగా అన్నిరకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఉపసంహరణ గడువు ముగిసే చివరి క్షణం వరకు కాంగ్రెస్ అభ్యర్థిని ఉపసంహరింపచేసేందుకు విఫలయత్నం చేసి భంగపడింది. ఈ జిల్లాలో కాంగ్రెస్, టిడిపిలు కలిస్తే చెరొక స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉన్నా ఓటర్లను మచ్చిక చేసుకుని అధికార పార్టీ మభ్యపెట్టే కార్యక్రమాలు చేపట్టిందంటూ వస్తున్న విమర్శలను ఎదుర్కొంటున్న టిఆర్‌ఎస్ జిల్లాలో రెండు స్థానాలు మావేనంటూ ప్రకటించుకుంటోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్, టిడిపిలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కొంతమంది తమవైపు ఉన్నారంటూ టిఆర్‌ఎస్ చెప్తుండగా అందుకు భిన్నంగా సుమారు 70మంది టిఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు మీకే ఓటు వేస్తామంటూ టిడిపి లైన్‌లో వచ్చినట్టు వస్తున్న వదంతులు సంచలనాలు రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలు ఇస్తుందంటే టిడిపి రెండు లక్షలు ఆఫర్ చేసిందని ఒకరికి మించి మరొకరు డిమాండ్ చేస్తూ చివరకు ఐదు లక్షలు ఇస్తే తప్ప ఓటేసేందుకు అంగీకరించేది లేదని కొంతమంది ఓటర్లు అధికార పార్టీకి చెందిన నాయకులకు స్పష్టం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలావుండగా జిల్లా పరిషత్ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందని, ఇచ్చిన మాట తప్పారంటూ కొంతమంది ఓటర్లు గ్రూపులుగా ఏర్పడి భారీ డిమాండ్‌ను ముందుంచుతూ గెలవాలంటే తమను కలవాల్సిందేనంటూ మంతనాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అధికార పార్టీ వైపు స్పష్టంగా ఒక్క స్థానం కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నా మరొకటి మాత్రం కాంగ్రెస్‌కు అవకాశాలు ఉన్నాయని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ సమయం వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని బరిలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన వారు సన్నాహాలు చేస్తుండగా అలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని ఎన్నికల కమిషన్ చేసిన హెచ్చరిక ఎంతవరకు కట్టడి చేస్తుందో ఎదురు చూడాల్సిందే. కొంతమంది మాత్రం అధికార పార్టీ నాయకులు ఇదే అదనుగా చేసుకుని సొమ్ము చేసుకునే కార్యక్రమాలు చేపడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గాలవారీగా ఎవరి పరిధిలో వారు ఓటర్లను చేజార్చుకోకుండా తీసుకోవాల్సిన చర్యల్లో ఏమాత్రం తప్పిదం జరిగినా ఫలితాలు మారతాయంటూ గులాబీ నేతలకు అధిష్టానంనుండి హెచ్చరికలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకుంటే తప్ప తెరాసకు వచ్చే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మెజారిటీ దక్కించుకునే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు అంచనా వేసుకుంటున్నట్టు తెలిసింది.