హైదరాబాద్

కులాంతర, మతాంతర వివాహాలు ఏప్రిల్ 5న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లకుంట, మార్చి 29: సమాజంలో నెలకొని ఉన్న అంటరానితనం, కుల, మతాల మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని నిరోధించడానికి, వరకట్నాన్ని నిషేధించడానికి ఈనెల 5న మాజీ ఉపప్రధాని డా. బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరిచుకుని వివాహాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ దళిత కల్యాణ వేదిక చైర్మన్ రేణిగుంట ఎల్లయ్య తెలిపారు. మంగళవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివాహాలు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50వేల పారితోషకం ఇస్తుందని న్నారు. అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు తప్పకుండా నిండిన వారికి మాత్రమే వివాహాలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తికలవారు 9391139770 నెంబర్‌కు ఫోన్‌లో సంప్రదించగలరని తెలిపారు. సమావేశంలో వేదిక ప్రధాన కార్యదర్శి అర్.అనీల్‌కుమార్, టిఆర్‌ఎస్ మహిళా విభాగం కార్యదర్శి మనె్నరేవతి, దళిత మహిళా సంఘర్షణ సమితి ప్రధాన కార్యదర్శి అంజలిఖాదర్, మురళీ పాల్గొన్నారు.

ఆత్మస్థయిర్యంతో
ఐఏఎస్ సాధించొచ్చు
హైదరాబాద్, మార్చి 29: పట్టుదల, ఆత్మస్థయిర్యం ఉంటే ఐఎఎస్ సాధించవచ్చునని, ప్రతి అభ్యర్థి దృఢ నిశ్చయంతో శిక్షణ తీసుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారని విశ్రాంత ఐఎఎస్ అధికారి డా.మోహన్‌కందా అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన డా.లక్ష్మయ్య ఐఎఎస్ స్టడీ సర్కిల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోహన్‌కందా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ చాలా అవసరం. చదివే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. ఐఎఎస్ చదవటం బ్రహ్మవిద్యేమి కాదు. ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయితే ర్యాంకు సాధించినట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ డా.లక్ష్మయ్య మాట్లాడుతూ తమ సంస్థల శిక్షణ పొందేందుకు అవసరమైన నియమ నిబంధనలను తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రభుత్వ అధికారులు కృష్ణయ్య, బైరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ అనుభవాలను తెలుపగా పద్మజారాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.