హైదరాబాద్

పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.4 కోట్ల విలువైన స్థలం అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: మహానగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా ఇప్పటికే పోలీసింగ్ వ్యవస్థలో ఆధునిక మార్పులను చేసిన ప్రభుత్వానికి ఇపుడు ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరించేందుకు ముందుకొస్తున్నారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ చొరవతో బోరబండలోని నూకల రామచంద్రారెడ్డిపురం హౌజింగ్ కో ఆపరేటీవ్ సొసైటీ పోలీసులకు ఈ స్థలం తాలుకూ పత్రాలను మంగళవారం డిప్యూటీ మేయర్‌కు అందజేశారు. రూ. 4వేల కోట్ల విలువైన స్థలాన్నిచ్చేందుకు సొసైటీ సభ్యులు ముందుకు రావటం పట్ల ఆయన వారిని ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఎంతో విలువైన స్థలాన్ని పోలీస్‌స్టేషన్ నిర్మాణానికిన అప్పగించటంతో రామచంద్రారెడ్డిపురం హౌజింగ్ సొసైటీ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిల్చిందని ప్రశంసించారు. ఈ సొసైటీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కె.అంజయ్య, ఎం.నర్సింహారెడ్డి, మహ్మద్ జమాముద్దిన్, మహ్మద్ యాసిన్, రెహ్మాన్, బాల్‌రాజ్ పాల్గొన్నారు.