హైదరాబాద్

అక్రమ నిర్మాణాల కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 14: జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్‌లోని కురుమనగర్‌లో పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది విజృంభించారు. అక్రమ నిర్మాణాలపై కనె్నర్ర చేశారు. అంతటితో ఆగకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉద్రిక్త వాతావరణంలో కూల్చివేతల పర్వం కొనసాగింది. పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ మెహ్ర పర్యవేక్షణలో మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించగా మున్సిపల్ సిబ్బంది లక్షలు వెచ్చించి నిర్మించుకున్న నిరుపేదల ఇళ్లను కూల్చివేశారు. వివరాల్లోకి వెళితే..కురుమగర్ కన్సర్వేషన్ జోన్. దీంతో ఇక్కడ ఇంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వడంలేదు. కూలి పని చేసుకుంటున్న నిరుపేద, మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసుకున్నారు.
ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వమని వెళితే ఇవ్వడంలేదు. దీంతో ఎలాంటి అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణాలు చేపట్టారు. దాదాపు ఇళ్లతో నిండి ఉన్న కాలనీలో నిర్మించుకున్న ఇళ్లకు మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు కేటాయించి ఆస్తిపన్ను సైతం వసూలు చేస్తున్నారు. ప్రజలకు కనీస అవసరాలైన మంచినీరు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ సౌకర్యాలను కల్పించారు. దీంతో కాలనీ మరింత అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తుంది. మిగిలిన ఖాళీ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండగా వివాదాస్పదమైన ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయని అధికార పార్టీ-బీజేపీ ఆధ్వర్యంలో ఫిర్యాదులు వస్తుండటంతో మున్సిపల్ అధికారులు కబ్జాదారులపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండగా అనుమతి లేకుండా బహుళ అంతస్థులతో ఇంటి నిర్మాణాలు ఎలా చేపట్టారని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం వీటిపై సమాధానం ఇవ్వకముందే సోమవారం ఉదయం మున్సిపల్ సిబ్బంది, పోలీసుల బందోబస్తు మధ్య పూర్తయిన ఇంటి నిర్మాణాలను కూల్చివేశారు. కూల్చవద్దని అడ్డువచ్చిన మహిళలను సైతం పక్కకు నెట్టేసి మరీ కూల్చివేయడం హేయమైన చర్య అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదయ్య భార్య, కూతురు పోలీసులతో వచ్చి ఇంటిని కూల్చివేసి అవమానిస్తారా అంటూ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడటంతో మహిళా పోలీసులు రక్షించారు. అప్పటికే ఐదు ఇళ్లను కూల్చివేశారు. అక్కడి నుంచి అబ్బయ్య ఇంటి నిర్మాణాన్ని కూల్చివేస్తుండగా తరలి వచ్చిన మహిళలు కూల్చవద్దని చేతులు ఎత్తి మొక్కినా సిబ్బంది వినకపోవడంతో తిరగబడి రాళ్లతో దాడి చేశారు.
విషయం తెలుసుకున్న స్థానిక మహిళా కార్పొరేటర్ మేకల అనలారెడ్డి, భర్త హన్మంత్ రెడ్డి, పార్టీ కార్యకర్తలతో వచ్చి కూల్చవద్దని సిబ్బందిని వేడుకున్నారు. ఒక దశలో కూల్చకుండా అడ్డుకుని బాధితులకు అండగా నిలిచారు. ఇదే సమయంలో కార్యకర్తలతో కురుమనగర్ చేరుకున్న కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గం ఇన్‌చార్జి బండారు లక్ష్మారెడ్డి అధికారుల తీరుపై ధర్నా నిర్వహించడంతో కూల్చివేతలు నిలిచిపోయాయి. నిర్మాణం ప్రారంభ దశలో ఆపాలే తప్ప నిర్మాణాలు పూర్తయిన తర్వాత కూల్చివేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలకు స్వస్తిపలకాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఒక దశలో ఏసీపీ మెహ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపై ప్రతాపం.. పెద్దలకు దాసోహమా అని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు అన్య బాలకృష్ణ, రఘుపతి రెడ్డి, జి.జితేందర్ రెడ్డి, సుక్క కిరణ్, నిరంజన్, రాజేశ్వర్ రెడ్డి, అనీల్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, మస్తాన్ పేర్కొన్నారు.
డబ్బులివ్వకపోతే కూల్చివేస్తారా..?
ఇంటి నిర్మాణం కోసం వెళ్లితే అనుమతి ఇవ్వరు. నిర్మించుకున్న ఇళ్లను కూల్చిస్తారా ఇదేమి న్యాయమని స్థానిక కార్పొరేటర్ మేకల అనలా రెడ్డి అధికారులపై మండిపడ్డారు. ఎక్కడబడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కేవలం తమ డివిజన్‌పై పగపట్టి కూల్చివేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులిస్తే వౌనంగా ఉంటారని, ఇవ్వకపోతే కూల్చివేస్తారని ఆరోపించారు. తమ డివిజన్ ప్రజలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.