హైదరాబాద్

బల్దియా కమిషనర్ ఆదేశాలు బేఖాతర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ చేపట్టే ప్రతి పనికి సంబంధించిన బిల్లును ఏ మాత్రం జాప్యం లేకుండా, సకాలంలో చెల్లించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలు అమలుకు నోచుకోవటం లేదు. వివిధ రకాల పనులు చేసే కాంట్రాక్టర్లు బిల్లుల కోసం క్లెయిమ్ చేసుకుంటే అలవాటులో పొరపాటుగా సిబ్బంది మీకు బిల్లులు చెల్లిస్తే మాకేంటీ? అంటూ బాహాటంగానే లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కమిషనర్, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఇతర విభాగాల్లో పారదర్శకత, జవాబుదారితనం అంటూ సరికొత్త ఆధునిక సంస్కరణలు, విధానాలను అమల్లోకి తెచ్చినా, బిల్లుల చెల్లింపు విభాగాన్ని పట్టించుకోకపోవటంతో ఈ విభాగంలోని అక్రమార్కుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బిల్లుల చెల్లింపులో కార్పొరేషన్‌కు జవాబుదారితనం, బాధ్యత అవసరం ఉండదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఫలితంగా అప్పులు చేసి పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు అందకపోవటంతో అనేక రకాల ఇబ్బందుల పాలవుతున్నారు. గతంలో రవాణా శాఖలో స్పేర్ పార్ట్స్ సప్లై చేసిన రందాన్ అనే కాంట్రాక్టర్‌ను ఇదే తరహాలో బిల్లుల చెల్లింపుల విషయంలో వేధింపులకు గురి చేయటంతో ఆయన ప్రధాన కార్యాలయం ఆవరణలో అపస్మారక స్థితికి చేరుకుని, ఆ తర్వాత గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కూడా ఉంది. ఈ సంఘటనతో అపుడున్న ఉన్నతాధికారులు, ప్రస్తుత కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం చేయకుండా సకాలంలో చెల్లించి, సరైన విధంగా నాణ్యతతో కూడిన పనులను చేయించాలని ఆదేశించినా, బిల్లుల చెల్లింపులో సంబంధిత సిబ్బంది అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. చెల్లించాల్సిన బిల్లు ప్రకారం పది నుంచి 15 శాతం వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక సగానికి సగం లంచాలిస్తామంటే చేయని పనులకు కూడా బిల్లులు తయారుచేసి, చెల్లింపులు జరుపుతున్న ఘనులున్నారు. సక్రమంగా పనులు చేసినా, బిల్లులు ఎందుకు చెల్లించటం లేదని ప్రశ్నిస్తే పనుల్లో లోపాలున్నాయని, తిరిగి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని కొర్రీలు పెడుతున్నట్లు ఉద్యానవన శాఖలోని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

ఇక్కడంతా ఇష్టారాజ్యమే...
బిల్లుల చెల్లింపులో మామూళ్లు ఆనవాయితీ ఇపుడు బయోడైవర్శిటీ విభాగానికి కూడా చేరింది. పనులు పూర్తి చేసిన కొందరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించటంలో అధికారులు మీన మేషాలు లెక్కించటంతో కాంట్రాక్టర్లు సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ కూడా ఫిర్యాదులు చేశారు. పశ్చిమ మండలం పరిధిలోని అయ్యప్ప సొసైటీలో హైటెన్షన్ విద్యుత్ లైన్ల కింద సుందరీకరణ పనులను 13 నెలలపాటు చేపట్టారు. చేసిన పనులకు అనుగుణంగా ప్రతి మూడు నెలలకో బిల్లును మంజూరు చేయాల్సి ఉంది. కానీ ఈ విభాగంలోని ఓ డిప్యూటీ డైరెక్టర్ ఉద్దేశ్యపూర్వకంగా బిల్లులు మంజూరు చేయకుండా ఆపేస్తున్నారని, అప్పులు చేసి పనులు చేసే తమ పరిస్థితి ఏమిటీ? అంటూ కబీర్ పాషా అనే కాంట్రాక్టర్ వాపోయారు. తనను బిల్లుల కోసం వేధిస్తున్నట్లు తాము సీఎం, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశానన్న కసితో తాను పని సక్రమంగా చేయలేదని నోటీసులిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యప్ప సొసైటీ చౌరస్తాలో ఇటీవల నిర్మించిన అండర్‌పాస్ నిర్మాణంలో భాగంగా పలు చెట్లను తొలగిస్తే, తానెలా బాధ్యుడనవుతానని ఆయన ప్రశ్నించారు. ఈఆర్‌పీ, బిల్లు ఆమోదం పొందిన తర్వాత చెల్లింపులను ఆపుతున్నారని వివరించారు.

ఉపశమనం...పలు ప్రాంతాల్లోజల్లులు
హైదరాబాద్, మే 14: ఎండలతో మండిపోతున్న నగరానికి ఉపశమనం కలిగింది. వాతావరంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా ఏర్పడిన క్యుములో నింబస్ మేఘాల కారణంగా నైరుతి రుతుపవనాలను ఇంకా రాకముందే వర్షాలు మొలయ్యాయి. ఉదయం నుంచి ఎండతో మండిపోతూ ఉక్కిరిబిక్కిరి అయిన నగరంలో మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. నల్లటి మేఘాలు కమ్ముకుని, బలమైన ఈదురుగాలులతో జల్లులు కురిసాయి.
సికిందరాబాద్‌లోని నెరెడ్‌మెట్, మల్లాపూర్, ఆల్వాల్, మల్కాజ్‌గిరి, తార్నాక, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతాల్లో వర్షం, బలమైన ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా కరెంటు సరఫరాను నిలిపివేశారు. బేగంపేట, లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, బంజారాహిల్స్, మాసాబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.