హైదరాబాద్

వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లకు మరమ్మతులు చేయాలని జలమండలి ఎండీ దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం బోర్డు ప్రధాన కార్యాలయంలో హడ్కో, ఓఆర్‌ఆర్ ప్రాజెక్టులు, రోడ్ల మరమ్మతుల పనుల పురోగతి అంశాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ ముందుస్తుగా వర్షాలు కురిసినా, నగరవాసులకు ఇబ్బందులు కలగకుండా రోడ్లకు మరమ్మతులను చేపట్టాలని, ఈ పనులన్నింటినీ కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని గడువు విధించారు. ఇందుకు అవసరమైన సంఖ్యలో కార్మికులను నియమించుకోవటంతో పాటు యంత్రాలను కూడా సమకూర్చుకోవాలని సూచించారు. గ్యాప్‌లు, జంక్షన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా రోడ్లకు మరమ్మతులు జరిగేటపుడు ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా నివారణ చర్యలు చేపడుతూ, పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడరాదని సంస్థల ప్రతినిధులకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు నూతన నల్లా కనెక్షన్ల ప్రక్రియను ప్రస్తావిస్తూ, కొత్త నల్లాల కనెక్షన్ల మంజూరీ, కనెక్షన్లు ఇవ్వటం వంటి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కనెక్షన్లను మంజూరు చేయటం, వినియోగదారుడు కనెక్షన్ కలుపుకున్న తర్వాత పైప్‌లైన్ కోసం తవ్విన గుంతను ఖచ్చితంగా పూడ్చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో జలమండలి ఈడీ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు-2 డైరెక్టర్ డి.శ్రీ్ధర్‌బాబు, ఆపరేషన్స్-2 డైరెక్టర్ పి.రవితో పాటు సంబంధిత సీజీఎంలు, జీఎంలు, పనులు చేపట్టిన వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.