హైదరాబాద్

చెక్కులు..చిక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్: రైతుబంధు పథకం చెక్కులతో బ్యాంకుల వద్దకు రైతులు తరలుతున్నారు. బ్యాంకుల వద్ద రైతన్నల తాకిడి ఎక్కువగా అవుతున్న తరుణంలో పోలీసులను బ్యాంక్ అధికారులు ఆశ్రయిస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణలోనే రైతులకు నగదును పంపిణీ చేస్తున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్‌తోపాటు షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని ఏ బ్యాంక్ చూసినా అన్నదాతలతో కిక్కిరిసిపోయింది. బ్యాంకుల నుంచి నగదు తీసుకునేందుకు అన్నదాతలు క్యూ కడుతున్నారు. కొన్ని బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో అన్నదాతల నుంచి చెక్కులు తీసుకొని టోకన్లు ఇచ్చి మరుసటి రోజు వచ్చి డబ్బులు తీసుకువెళ్లాలని అధికారులు చెబుతున్నారు. మంగళవారం షాద్‌నగర్ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో నగదు లేకపోవడంతో రైతుల నుండి చెక్కులు తీసుకొని టోకన్లు జారీ చేశారు. బుధవారం ఉదయం వచ్చి బ్యాంక్‌లో టోకన్లు చూపించి నగదు తీసుకోవాలని రైతులకు సూచించారు. మరో రెండు రోజుల్లో 100 శాతం రైతులు నగదు పొందే అస్కారం ఉందని అధికారులు తెలిపారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దు
నార్సింగి, మే 15: రంజాన్ మాసంలో హోటళ్లు, రెస్టారెంట్లు, తొపుడు బండ్ల వ్యాపారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని నగర ట్రాఫిక్ డీసీపీ కే.బాబురావు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆసీఫ్‌నగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సైదులు గౌడ్ ఆధ్వర్యంలో డీసెంట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన స్థానిక హోటళ్లు, రెస్టారెంట్ల, తొపుడు బండ్ల నిర్వహకులతో ట్రాఫిక్ అవగాహన సదస్సును నిర్వహించారు. డీసీపీ బాబురావు మాట్లాడుతూ ట్రాఫిక్ రంజాన్ పండుగ పురస్కరించుకుని పలు హోటళ్ల, రెస్టారెంట్ల, తొపుడు బండ్ల వ్యాపారులు రోడ్లుపై పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. రోడ్లుపై పెట్టి వ్యాపారం చేసినవారిపై పెనాల్టీలు వేస్తామని హెచ్చరించారు. అదనపుడీసీపీ మహ్మాద్ తాజోద్దీన్, ఏసీపీ పీ.సంజీవ్ కుమార్ పాల్గొన్నారు.