హైదరాబాద్

ముందే రానున్న వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈసారి వర్షాలు కాస్త ముందుగానే కురిసే అవకాశాలున్నాయి. ఇప్పటికే వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, ఉపరితల ద్రోణి కారణంగా నగరంలో ఆకస్మికంగా, అకాల వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా జూన్ రెండో వారం తర్వాత దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత వాతావరణం చల్లబడటం, క్రమంగా జల్లులు కురవటం జరిగేది. కానీ ఈసారి వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా ఏర్పడుతున్న క్యుములోనింబస్ మేఘాల కారణంగా మరో రెండు, మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని చెబుతున్న వాతావరణ శాఖ అధికారులు, పర్యావరణవేత్తలు నైరుతి రుతుపవనాలు రాకముందే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించటంతో నగరవాసుల జీవనంతో ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, వాతావరణం, ఆర్టీసి తదితర శాఖల అధికారులు ఈసారి కాస్త ముందు నుంచే అప్రమత్తమయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొద్దిరోజుల క్రితం జీహెచ్‌ఎంసీకి ప్రత్యేక విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ప్రభుత్వం నియమించింది. అప్పటికే జీహెచ్‌ఎంసీలో నామమాత్రంగా ఉన్న విపత్తుల నివారణ విభాగంలో నియమించిన సిబ్బందిని తమ విభాగానికి కేటాయించాలని ఆ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి కోరిన సంగతి తెలిసిందే! అంతేగాక, చిన్నపాటి వర్షం పడితే రోడ్లపై నీరు నిల్వటం, ట్రాఫిక్ జామ్ కావటం, లోతట్టు ప్రాంతాలు నీట మునగటం వంటి సమస్యలపై అధ్యయనం చేసి, వర్షాలు ప్రారంభమయ్యేలోపు వాటర్ స్టాగినేట్ పాయింట్లన్నింటినీ కూడా జియోట్యాగింగ్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు ప్రారంభమయ్యేలోపు విపత్తుల నివారణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్‌ను పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారైనా ప్రజలకు వర్షాకాలం కష్టాలను తగ్గించేందుకు వివిధ శాఖలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీనికి తోడు కోర్ సిటీలో మాదిరిగా శివార్లకు కూడా తాగునీటిని అందించేందుకు జలమండలి చేపట్టిన హడ్కో, ఓఆర్‌ఆర్ తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే తవ్విన రోడ్లకు ఈ నెలాఖరులోపు మరమ్మతులను పూర్తి చేయాలని జలమండలి ఎండీ దాన కిషోర్ అధికారులకు గడువు విధించారు. దీనికితోడు జీహెచ్‌ఎంసీ నగరంలో భారీ ఎత్తున చేపట్టిన రోడ్ల మరమ్మతులు, రీ కార్పెటింగ్ పనులు కూడా గడువులోపు పూర్తి కావాలని మేయర్ బొంతు రామ్మోహన్ అర్థరాత్రి అకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ, పనులు సకాలంలో పూర్తిచేసేలా వత్తిడి తెస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు వాతావరణ శాఖను ఇప్పటికే సమన్వయం చేసుకుని వర్షం కురిసే ప్రాంతాలు, సమయాన్ని ఎప్పటికపుడు తెల్సుకుని, అధికారులకు, నగరవాసులను అలర్ట్ చేస్తున్నారు.