హైదరాబాద్

‘స్వచ్ఛ’సిటీ భాగ్యనగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: జీహెచ్‌ఎంసీకి అవార్డుల పంట పండుతోంది. ఇటీవలే ప్రతిష్టాత్మకమైన మూడు, నాలుగు అవార్డులను కైవసం చేసుకున్న జీహెచ్‌ఎంసీకి తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కింది. ఘన వ్యర్థాల నియంత్రణలో ఉత్తమమైన విధానాలను అవలంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. 2018 సంవత్సరం స్వచ్ఛసర్వేక్షణ్‌కు గాను కీలక అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని ఏ ఇతర మున్సిపల్ కార్పొరేషన్‌లో లేని విధంగా ప్రతి ఇంటి నుంచి తడి,పొడి చెత్తను సేకరించేందుకు ఇప్పటికే 44లక్షల డస్ట్‌బిన్లను పంపిణీ చేసింది.
అంతేగాక, తడి,పొడిగా వేర్వేరుగా చెత్తను ఇవ్వటంతో ప్రయోజనాలను తెలియజేసేందుకు ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం తడి,పొడి చెత్త సేకరణ కేవలం పాశ్చాత్య దేశాల్లోనూ, మన దేశంలో హైదరాబాద్ నగరంలోనే జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. 2016 ఘన వ్యర్థాల చట్టాన్ని ఎంతో పటిష్టంగా అమలు చేయటంలో కూడా జీహెచ్‌ఎంసీ అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అభినందించింది. ఈ తడి,పొడి చెత్తపై నగరంలో ఐదు లక్షల మంది సభ్యులున్న స్వయం సహాయక బృందాలు, పది లక్షలకు పైగా ఉన్న పాఠశాల విద్యార్థినీ విద్యార్థులను భాగస్వాములను చేసింది. ప్రతి ఇంట్లో మహిళలను తడి,పొడి చెత్తపై చైతన్యవంతులను చేసేందుకు ఇంటింటికి బొట్టు వంటి కార్యక్రమాన్ని నిర్వహించటంతో పాటు ప్రతి ఇంటి నుంచి నేరుగా చెత్తను సేకరించేందుకు వీలుగా తొలి దశగా 2వేలు, ఆ తర్వాత అవసరాన్ని బట్టి మరో 500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను సమకూర్చుకుని, దేశంలోని అన్ని స్థానిక సంస్థల కన్నా ఘన వ్యర్థాల నియంత్రణలో జీహెచ్‌ఎంసీ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందుకు ఈ స్వచ్ఛ అవార్డును ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ మంత్రితత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. జీహెచ్‌ఎంసీ చేస్తున్న రకరకాల ప్రయత్నాలతో నగరంలో ప్రతిరోజు పోగయ్యే చెత్తలో గతంలో కేవలం 3500 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇంటింటి నుంచి సేకరించగా, ప్రస్తుతం ఇదీ పెరిగింది. 2500 స్వచ్ఛ ఆటో టిప్పర్లకుతో 4500 మెట్రిక్ టన్నుల చెత్తను ఇంటింటికి తిరిగి సేకరిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ, ఇంత పెద్ద మొత్తంలో నేరుగా ఇళ్ల నుంచి చెత్తను దేశంలోని ఏ స్థానిక సంస్థ కూడా సేకరించటం లేదని, ఇది జీహెచ్‌ఎంసీకే సాధ్యమైందని కూడా అధికారులు వెల్లడించారు.

కేక్ కట్ చేసి ..
స్వచ్ఛ సిటీగా నగరానికి కేంద్రం పురస్కారాన్ని ప్రకటించటంతో బుధవారం సాయంత్రం బల్దియాలో మేయర్, అధికారులు సంబరాలు నిర్వహించారు. మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, ఇతర అధికారులు కేక్ కట్ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ నగరం పలు రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది సమష్టి కృషి, సమన్వయం వల్లే ఈ అవార్డు దక్కిందన్నారు.