హైదరాబాద్

రెటినోబ్లాస్టోమాపై అవగాహనకు వైటథాన్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పిల్లల్లో కంటి క్యాన్సర్ (రెటినోబ్లాస్టోమా)పై నగర ప్రజల్లో అవగాహన కోసం ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్‌లో ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి వైటథాన్ పేరుతో రన్ నిర్వహించింది. నెక్లెస్ రోడ్ నుంచి పీపుల్స్‌ప్లాజా వరకు కొనసాగిన ఈ రన్‌ను నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రారంభించారు. చిన్నారుల్లో కంటి సమస్యకు కారణం అవుతున్న రెటినోబ్లాస్టోమాపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి చైర్మన్ జీఎన్ రావు కోరారు. ఇతర వ్యాధులతో పోల్చీతే కంటి సంబంధ వ్యాధుల పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దీంతో కంటి చూపు పూర్తిగా మందగించిన తరువాతే వైద్యులను సంప్రదిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో కంటి వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.