హైదరాబాద్

దోమలు బాబోయ్..దోమలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఆశించిన స్థాయిలో అమలుకావటం లేదు. ఇందుకు శివార్లలోని పలు చెరువుల్లో కుప్పలుగా పేరుకుపోయి దర్శనమిస్తున్న గుర్రపు డెక్కే నిదర్శనం. నాచారం హెచ్‌ఎంటినగర్‌లోని చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగిపోవటంతో దోమలు విజృంభిస్తున్నాయి.
సుమారు మూడు దశాబ్దాలుగా ఈ సమస్యతో స్థానికులు ఎన్నో ఇబ్బందులెదుర్కొంటున్నా, నేటికీ సమస్య పరిష్కారం కాకపోవటం పాలకులు చిత్తశుద్ధికి నిదర్శనం.
అప్పట్లో హెచ్‌ఎంటినగర్ సంక్షేమ సంఘం కృషితో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో తెలుగు గ్రామీణ పథకం స్కీం కింద వాటర్ ట్యాంకర్‌ను నిర్మించుకుని నీటి సమస్య నుంచి బయటపడ్డ ఇక్కడి స్థానికులు ఇపుడు దోమల బెడదతో సతమతమవుతున్నారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో రెండు పార్టీల ప్రభుత్వాలు దోమల నివారణ విషయంలో స్థానికులకు వాగ్దానాలిచ్చి కాలం గడుపుకుంటూ వచ్చారే తప్ప, ఈ రోజు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా చెరువులను పునరుద్ధరించి, పరీక్షించి, సుందరీకరణ పనులు చేపట్టి, బోటు షికారు కూడా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అంతేగాక, ఇటీవల జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా దోమల నివారణ విషయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాల్ని విస్మరించారని స్థానిక సంఘం నేతలు, సంఘ సేవకులు పర్చా శరత్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. గెలిచిన అభ్యర్థులైనా ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చి దోమల బెడద నుంచి విముక్తి కల్గించాలని స్థానికులు కోరుతున్నారు.

తెలుగు కవులలో సమన్వయ లోపం
హైదరాబాద్, మార్చి 30: కన్నడ భాషలను, కవులలోవున్న సమైక్యత, సమన్వయం తెలుగు కవులలో లేదని ఎపి శాసనసభ ఉప సభాపతి మండల బుద్ధప్రసాద్ అన్నారు. కన్నడ భాషా కవులలో ఎవరైనా స్వర్గస్తులైతే కవులందరూ వెళ్లి సంతాపం తెలుపుతూ కవిత చదివి శ్రద్దాంజలి ఘటిస్తారని ఆయన అన్నారు. ఆ సమన్వయత తెలుగు కవులలో లేకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ కవి శిఖామణి వ్రాసిన ‘వాగర్ద’ ఆధునిక సాహిత్య వ్యాసాల పుస్తకాన్ని బుధవారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఆధునిక కవులలో శిఖామణి ఒకరని కవిత్వం ఒక ప్రక్క, విమర్శలు మరోప్రక్క చేయగల మేథావి శిఖమణి అని ఆయన అన్నారు. సమాజానికి మార్గదర్శకమైన సాహిత్యాన్ని అందిస్తున్న కవులలో శిఖామణి ఒకరని, తెలుగు భాష విశిష్టతను చాటే ఆచార్యులని బుద్దప్రసాద్ అన్నారు. ప్రముఖ విమర్శకులు ఖాదర్ మొయియుద్దీన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో తులనాత్మక సాహిత్యం రావడంలేదని విశ్వవిద్యాలయం వెలుపల వున్న కవులే తులనాత్మక సాహిత్యానికి ఎక్కువ కృషిచేస్తున్నారని ఆయన అన్నారు. సభకు అధ్యక్షత వహించిన రచయిత్ర ఓల్గా ‘సేతువు’ పుస్తకాన్ని ఆవిష్కరించి శిఖామణిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎం.నారాయణశర్మ, పొట్లూరి హరికృష్ణ, ఆర్.సీతారాం తదితరులు పాల్గొన్నారు.