హైదరాబాద్

అర్ధరాత్రి తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని కోటి మంది జనాభా జీవితంతో అత్యంత ముఖ్యమైన సంబంధం కల్గిన జీహెచ్‌ఎంసీ, జలమండలిలో అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మొత్తం మెయిన్ రోడ్ల రూపురేఖలను మార్చేందుకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ అర్థరాత్రి దాటిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు ఏ మాత్రం ముందస్తు సమాచారం లేకుండా మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్నతాధికారులు నేరుగా పనులు జరిగే చోటుకు వెళ్లి పనులు నిర్వహిస్తున్న తీరు, అందులోని నాణ్యతను తనిఖీ చేస్తున్నారు. బొంతు రామ్మోహన్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఇలాంటి తనిఖీలు నిర్వహించినా,ప్రస్తుతం నిరంతం తనిఖీలు నిర్వహించటం పట్ల అధికారులు, కాంట్రాక్టర్లలో భయం నెలకొంది. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్‌లు అధికారులతో కలిసి బాగ్ అంబర్‌పేట డివిజన్‌లోని డీడీకాలనీలో బీటీ రోడ్డు నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అంతకుముందు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రోడ్డు నిర్మాణ పనులను కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్డు వేస్తున్న ఎత్తును, వినియోగిస్తున్న ముడిసరుకును మేయర్ తనిఖీ చేశారు. జలమండలి ఎండీ దానకిషోర్ కూడా ఔటర్, హడ్కో తాగునీటి ప్రాజెక్టుల పనులను అర్థరాత్రి తనిఖీ చేసి, పనులు సకాలంలో పూర్తయ్యేందుకు వీలుగా పలు సూచనలు, సలహాలిచ్చిన సంగతి తెలిసిందే! అంతేగాక, పనుల కారణంగా తవ్వేసిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని కూడా అధికారులు, పనులు చేపట్టిన సంస్థలను ఆదేశించారు. ఇలాంటి తనిఖీలు మున్ముందు మరిన్ని చేయనున్నట్లు ఎండీ వెల్లడించటంతో క్షేత్రస్థాయిలో పనుల తీరు మెరుగుపడిందని చెప్పవచ్చు. తనిఖీల్లో క్షేత్ర స్థాయి పరిస్థితులను గమనించిన ఎండీ పైప్‌లైన్ నిర్మాణం కోసం సిబ్బంది తవ్వి వదిలేసిన రోడ్లతో మున్ముందు వర్షాకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని గుర్తించి, ఈ పనులను పూర్తి చేసేందుకు డెడ్‌లైన్ విధించారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ శనివారం రాత్రి బైక్‌పే రోడ్లను శుభ్రపరిచే స్వీపింగ్ యంత్రాలను కూడా పరిశీలించారు. యంత్రంలోని రోడ్లను శుభ్రపరిచే బ్రష్‌లు, నీటి నిల్వ, ఇతర నిర్వహణ అంశాలను డిప్యూటీ మేయర్ అధికారులను అడిగి తెల్సుకున్నారు. యంత్రాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. స్వీపింగ్ మిషన్లలో లోపాలు ఏర్పడితే నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఎజెన్సీలపై చర్యలు తీసుకోనున్నట్లు సూచించారు. అదేరోజు రేతిబౌలీలో రూ.10 కోట్లతో హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నాలుగున్నర కిలోమీటర్ల పొడువున చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను మేయర్ రామ్మోహన్ తనిఖీ చేశారు.