హైదరాబాద్

తెలంగాణ ఎక్సలెన్సీ అవార్డును స్వీకరించిన కమిషనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,: మహానగరవాసులకు పౌరసేవల నిర్వహణ, అభివృద్ధి పనులను అందించే జీహెచ్‌ఎంసీకి దక్కిన మరో అరుదైన అవార్డును సోమవారం కమిషనర్ జనార్దన్ రెడ్డి స్వీకరించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు చేతుల మీదుగా ఈ అవార్డును కమిషనర్ స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానం చేసే ప్రతిష్టాత్మకమైన ఎక్సలెన్సీ అవార్డు 2018 జీహెచ్‌ఎంసీకి దక్కటం పట్ల కమిషనర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది సమష్టి కృషి వల్లే ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కిందని కమిషనర్ వ్యాఖ్యానించారు. చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషీ, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సురేశ్ చంద్రలతో పాటు పలువురు రిటైర్డు ఐఏఎస్ అధికరాలు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ తరపున అదనపు కమిషనర్ భారతి హోళికేరీ, భాస్కరచారి హాజరయ్యారు.
నేడు రిజర్వాయర్లు ప్రారంభం
నగర ప్రజలకు మెరుగైన నీటి సరఫరాను అందించేందుకు జలమండలి వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ఆరు రిజర్వాయర్లను మంగళవారం మంత్రి ప్రారంభించనున్నారు. ఉదయం పది గంటల నుంచి ప్రారంభం కానున్న మంత్రి పర్యటనలో భాగంగా దాదాపు రెండున్నర గంటల్లో శిల్పారామం వద్ద ఏసీ బస్ షెల్టర్‌తో పాటు అయ్యప్ప సొసైటీ, శిల్పారామం ఎదురుగా, లింగంపల్లిలోని జీహెచ్‌ఎంసీ ఆఫీసు ఎదురుగా ఉన్న డోయన్స్ కాలనీ, కొండాపూర్‌లోని గోల్డెన్ తులిప్, హాఫీజ్‌పేట, హైదర్‌నగర్‌లలో నిర్మించిన రిజర్వాయర్లను మంత్రి ప్రారంభించనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.