హైదరాబాద్

రైతుబంధును 30 వరకు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైతుబంధు పథకం కింద పంపిణీ కాని పాస్‌పుస్తకాలు, చెక్కులను తహశీల్దార్ కార్యాలయాల్లో ఈనెల 30వ తేదీ వరకు పంపిణీ చేయాలని రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు ఆదేశించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మొదటి దశ రైతు బందు కార్యక్రమంపై తహశీల్దార్‌లు, ఏఇఓలతో సమావేశం నిర్వహించారు. పంపిణీ విషయాలను ఎప్పటికప్పుడు మోబైల్ ఆప్‌లో అప్డేట్ చేయాలని చెప్పారు. ప్రతి చెక్కు పంపిణీ సక్రమ పద్దతిలో రికార్డు అయ్యేలా చూడాలని, ఆధార్ కార్డు తప్పనిసరిగా చూసి పంపిణీ చేయాలని అన్నారు. తమ దగ్గరికి వచ్చే ప్రతి రైతుకి చెక్కు డ్రా చేయడంలో ఇబ్బంది ఉంటే వారిని సరైన రీతిలో అవగాహన పరిచి వారికి డబ్బు అందేలా సహకరించాలని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో 89000 చెక్కులు 45 బ్రాంచీల ద్వారా నగదు డ్రా చేయబడిందని అన్నారు. పాస్‌బుక్కులు రాకుండా చెక్కులను పంపిణీ చేసిన, చేయబోయే జాబితాని గ్రామాలవారీగా తయారు చేసి మండలాలలోని అన్ని బ్యాంకులకు పంపించాలని, ఆ కాపీని తహశీల్దార్ కార్యాలయంలో కూడా బోర్డులో పెట్టాలని పేర్కొన్నారు. రైతుబంధుకి సంబంధించిన ఫిర్యాదులు యథావిధిగా స్వీకరించబడతాయని వాటిని పరిష్కరించాలని, తహశీల్దార్‌లు డిజిటల్ సంతకాలు తప్పనిసరిగా పూర్తి చేయాలని అన్నారు. ఈనెల 30వ తేదీ వరకు అన్ని పాస్‌పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేసే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో మొదటి విడత రైతుబంధు పథకంలో 235673 పాస్ పుస్తకాలకు 194204 పుస్తకాలు, 216320 చెక్కులు పంపిణీ చేశామని అన్నారు. జిల్లాలో 82 శాతం పాస్‌బుక్‌ల పంపిణీ పూర్తి కాగా ఇంకా 18 శాతం 41469 పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందని, ప్రాథమికంగా 5717 పాస్ పుస్తకాలు అచ్చు తప్పులతో నిలిపివేశామని, 512 చెక్కులు వివిధ కారణాలతో నిలిపి వేశామని అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరీష్, జిల్లా వ్యవసాయాధికారి గీత, సీఈఓ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్‌డీఓలు పాల్గొన్నారు.