హైదరాబాద్

రహదారిలో భద్రత.. ఆపై ట్రాఫిక్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 23: జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్‌లో చిరు వ్యాపారులకు రహదారిలో భద్రత..ఆ పై ట్రాఫిక్ క్లియర్ కోసం అర్బన్ కమ్యూనిటీ డవలప్‌మెంట్ (యూసీడీ) అధికారులు చర్యలు చేపట్టారు. సర్కిల్ పరిధిలోని చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ డివిజన్లలో చిరు వ్యాపారం చేసుకునేవారికి ప్రత్యేక వ్యాపార జోన్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సర్కిల్ పరిధిలో చిరు వ్యాపారులు ఎంతమంది ఉన్నారో సర్వే ద్వారా గుర్తించారు. మొత్తం 686 మందిని గుర్తించి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. అంతే కాకుండా వీరిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి 10 మంది చొప్పున గ్రూపులు చేసి బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలను ఇప్పించేందుకు సిద్ధమవుతున్నారు. రహదార్లలో ప్రమాదాలు జరుగకుండా భద్రతను కల్పించేందుకు ప్రత్యేక జోన్లలో భాగంగా అన్ని ప్రధాన రహదారులను రెడ్ జోన్‌గా ప్రకటించారు. నిత్యం వీఐపీలు తిరిగే రహదార్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎలాంటి వ్యాపారం చేయకుండా వ్యాపారానికి స్వస్తి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా ఉండే విశాలమైన గల్లీ రోడ్లను గ్రీన్ (ఫ్రీజోన్లు)గా ప్రకటించనున్నారు. ఇకపోతే సమయం ప్రకారం వ్యాపారం నిర్వహించే వ్యాపారులకు అంబర్‌పేట జోన్‌గా కొన్ని ప్రాంతాలను గుర్తించారు. ఇందుకోసం మున్సిపల్, ట్రాఫిక్, ఆర్‌అండ్‌బి, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగంతో పాటు వార్డు సభ్యులు, ఎల్‌ఎఫ్, యుసీడీ మొత్తం 16 మందితో ఏర్పాటు చేసిన స్ట్రీట్ వెండర్స్ కమిటీ అధికారుల బృందం బుధవారం పర్యటించింది. రెడ్, గ్రీన్, అంబర్ జోన్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసి ఎప్పటినుంచి అమలు చేయాలనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు డిప్యూటీ కమిషనర్ యాదగిరి రావు తెలిపారు.
జోన్లను వ్యతిరేకిస్తున్న చిరు వ్యాపారులు
భద్రత, ట్రాఫిక్ సమస్య పేరుతో మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లితున్న వ్యాపారంపై దెబ్బకొట్టే జోన్ల ఏర్పాటును చిరు వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటివరకు పూలమొక్కలు, పండ్లు, కూరగాయలు, టిఫిన్ సెంటర్లు, టీ కొట్లు, కొబ్బరి బొండాలు, ఇతర వ్యాపారం చేసుకుని జీవిస్తున్న వ్యాపారులకు ప్రధాన రహదారిని రెడ్ జోన్‌గా ప్రకటించి తమ వ్యాపారంపై దెబ్బ కొడితే గల్లీ రహదార్లలో ఎలా వ్యాపారం చేసుకోవాలో అర్ధం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జోన్లపై పునరాలోచించి యథావిధిగా ఉండేలా చర్యలు చేపట్టి చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని వ్యాపార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కంటోనె్మంట్‌లో రోడ్లను పూర్తిగా తెరవని మిలిటరీ అధికారులు
* ప్రధాన రోడ్లలో రాత్రి ఆంక్షల తొలగింపు
అల్వాల్, మే 23: కంటోనె్మంట్‌లో రోడ్ల మూసివేతకు పాక్షికంగా తెరపడింది. గత నాలుగు సంవత్సరాలుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు సాగిన పోరులో అన్నివర్గాల ప్రజలు, నాయకులు, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం , ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వరకు అందరు నిరంతరం చేసిన కృషివల్ల మూసివేసిన రోడ్లను ఎట్టకేలకు తెరిచారనీ ఫెడరేషన్ ఆఫ్ నార్త్- ఈస్టు కాలనీస్ ఆఫ్ సికింద్రాబాద్ ప్రతినిధి చంద్రశేఖర్ ప్రకటన జారీచేశారు. నాలుగేళ్లుగా మిలటరీ అధికారులు ఏడు రోడ్లను మూసివేశారు. దీంతో మల్కాజిగిరి, కాప్రా, చర్లపల్లి , ఇసిఐఎల్, ఉప్పల్ , వౌలాలి ప్రాంతవాసులు కాలనీల సంక్షేమ సంఘంగా ఏర్పాటై ప్రజాప్రతినిధులు, కంటోనె్మంట్, మిలటరీ, జిహెచ్‌ఎంసి, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటంతోనే రోడ్లను తిరిగి తెరిపించటం సాధ్యమైందనీ చంద్రశేఖర్ వివరించారు.
ప్రధానంగా ఏఓసీ గేటు, ఈస్టు మారెడ్‌పల్లి మీదుగా సఫిల్‌గుడకు వెళ్లేమార్గంలో నేటి నుంచి రాత్రి కూడా రాకపోకలను అనుమతిస్తారు. దీనితో రకరకాల దశల్లో జరిగిన ధర్నాలకు, ప్రజల నుండి మంచి సహకారం అందిందని తెలిపారు. ప్రధాన రోడ్లకన్నా ముందుగానే బొల్లారంలోని లకడావాల నుండి గోల్ఫు కోర్టు ద్వారా యాప్రాల్ చౌరస్తావరకు, విలేరియన్ గ్రామర్‌స్కూల్, ఈగల్ చౌక్ గేట్, బైసన్ రోడ్డు, హోలీట్రినిటీ చర్చి రోడ్డు, హకీంపేట రోడ్డు, హనుమాన్ టెంపుల్ బాలాజీనగర్ టెంపుల్ రోడ్డు, అమ్ముగూడ జంక్షన్, ఎంసిఇఎంఇకి అనుసంధానమైన రోడ్లును ఇంకా తెరవాల్సి ఉంది.
పూర్తిస్థాయిలో ఆదేశాలు వస్తే మూసివేతలను తొలగిస్తారనీ కొందరు చెబుతుండగా, శాశ్వతంగా మూసివేసిన వాటిని తొలగించరని చర్చ జరుగుతుంది.

ఉప్పల్ రహదారి వెడల్పులో యజమానులకు నష్టపరిహారం
* తొలి రోజు రూ.1.86కోట్ల చెక్కుల పంపిణీ
ఉప్పల్, మే 23: ఉప్పల్ ప్రధాన రహదారి వెడల్పు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న భవన యజమానులకు నష్టపరిహారం కింద ఆరుగురు వ్యక్తులకు బుధవారం ఎమ్మెల్యే ప్రభాకర్, కార్పొరేటర్ అనలారెడ్డి, డిప్యూటీ కమిషనర్ యాదగిరి రావు, ఏసీపీ మెహ్రాతో కలిసి రూ.1.86 కోట్ల చెక్కులను అందజేశారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నల్లచెరువు వరకు 1.5 కిలో మీటర్ పొడవునా మొత్తం 257 మంది భవన యజమానులు నష్టపోతున్నారు. వీరికి మార్కెట్ వ్యాల్యు ప్రకారం డబుల్ ధమాకా కింద నష్టపరిహారం అందజేయాలని నిర్ణయించారు. చెక్కుల పంపిణీ పూర్తయిన తర్వాతే రహదారి వెడల్పు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు పనులు ముందుకు సాగవు అనే రీతిలో కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.