రంగారెడ్డి

‘మహా’కౌన్సిల్‌లో సమస్యల ఎకరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: మహానగరంలోని కోటి జనాభాకు అతి ముఖ్యమైన పౌరసేవలు, అత్యవసర సేవలను అందించటంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం బుధవారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగింది. ఉదయం పదకొండు గంటల 45 నిమిషాలకు ప్రారంభమైన సమావేశంలో తొలుత మజ్లీస్ కార్పొరేటర్ సలీం బేగ్ మాట్లాడుతూ నగరంలోనీ వీదిదీపాలను ఎల్‌ఈడీ లైట్లుగా మార్చుతున్నామని ప్రకటించినా, ఇంకా పలు ప్రాంతాల్లో లైట్ల మార్పిడి పూర్తి కాలేదని అన్నారు. రంజాన్‌కు అదనంగా ఏర్పాట్లు చేస్తున్నామంటూనే, ఎక్కడా కూడా ఏర్పాట్లు జరగటం లేదని చెప్పారు. వర్షాకాలం ముంచుకొస్తున్నా, నాలాల్లోని పూడికను ఇంకా తొలగించలేదని మజ్లిస్, అధికారపార్టీ నేతలు మేయర్ బొంతు రామ్మోహన్ దృష్టికి తీసుకువచ్చారు. ఆగమేఘాలపై శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందని టీఆర్‌ఎస్, మజ్లిస్ సభ్యులు వాపోయారు. డివిజన్ ప్రజలకు జవాబుదారీ అయిన తమకు కనీస సమాచారం లేకుండా తమ ఏరియాలో విధులు నిర్వర్తించే శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లలో సక్రమంగా పనిచేయని వారిని గుర్తించి, తమకు సమాచారమిచ్చి బదిలీ చేయాల్సిందని వ్యాఖ్యానించారు. గత కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు కోరినందుకే వారిని బదిలీ చేశారని మేయర్ సమాధానమిచ్చినా, అందుకు సభ్యులు సంతృప్తి చెందలేదు. ఈ విషయంలో కార్పొరేటర్ శేషగిరిరావు, మేయర్‌ల మధ్య వాదనలు చోటుచేసుకున్నుయి. దోమల సమస్య తీవ్రమైందని, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే అవకాశముందని, ఈ సమస్యను ఇపుడే అరికట్టాలని మజ్లిస్ సభ్యుడు రాజేందర్‌యాదవ్, కాంగ్రెస్ సభ్యురాలు శాంతి.. సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇవాంక వంటి వీవీఐపీలు వచ్చినపుడు ఒక్క దోమ కన్పించదని, వారు వెళ్లిపోయిన తర్వాత ప్రజలకు బెడద తప్పదని, ఇందుకు అవరమైతే కమిషనర్ గోల్కొండ, కార్వాన్ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వీటితో పాటు పలు దీర్ఘకాలిక సమస్యలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. అకాల వర్షాలు కురిసినపుడు నగరం భయంతో వణికిపోతుందని, లోతట్టు ప్రాంతాలు, నాలా పరివాహక ప్రాంతాలు ముంపు భయంతో కొట్టుమిట్టాడుతున్నాయని, సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారంటూ అధికార, మజ్లిస్ పార్టీలకు చెందిన సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండున్నర గంటలకు మేయర్ ముగించిన ఈ సభలో ప్రస్తుతం నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, ఇంకా ప్రతిపాదనల స్థాయిలో ఉన్న అభివృద్ధి అంశాలతో పాటు త్వరలో పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్న రెండో స్థారుూ సంఘం సమావేశం ఇప్పటి వరకు పలు దఫాలుగా సమావేశమైన తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలపై చర్చ జరిగినానంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
దోమల నివారణ చర్యలు చేపట్టాలి
దోమల బెడద ఉందంటూ కార్పొరేటర్లు కౌన్సిల్‌లో ఎకరువు పెట్టడటంతో ఇందుకు సానుకూలంగా స్పందించిన మేయర్ దోమల నివారణకు ప్రస్తుతం చేపట్టిన చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. విభాగాధిపతిగా వ్యవహారిస్తున్న ఐఏఎస్ అధికారిణి స్నిగ్దా పట్నాయక్ తనను సభకు పరిచయం చేసుకుంటూ దోమలు ఎక్కువగా మూసీ పరివాహక ప్రాంతం, చెరువుల నుంచి పుట్టుకు వస్తున్నట్లు గుర్తించి, చర్యలు చేపట్టామన్నారు. దోమల నివారణ కోసం రాష్ట్ర మలేరియా విభాగం, డీఎంహెచ్‌ఓ విభాగాలతో కలిసి చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నామని వివరించారు. సిబ్బంది కొరత విషయాన్ని ప్రస్తావించగా, ఇటీవలే ఎలక్ట్రికల్ విభాగం నుంచి 30 మంది సిబ్బందిని తమకు కేటాయించారని, త్వరలోనే జోన్ల వారీగా యంత్రాంగాలు, సిబ్బందిని పెంచుకుని దోమల నివారణ చర్యలను ముమ్మరం చేస్తామని, వచ్చే నెలలో కాలనీ టూ కాలనీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సమాధానం చెప్పారు.
ఏకపక్షంగా ఎలా ప్రవేశపెడతారు
జీహెచ్‌ఎంసీ పరిధిలో 50 మైక్రాన్ల కన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్నా, అంతకన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను పూర్తి స్థాయిలో నిషేధిస్తున్నట్లు తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపుతున్నట్లు కౌన్సిల్‌లో మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. వెంటనే నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ జోక్యం చేసుకుని, ప్రతిపాదన స్థాయి సంఘం ముందు పెట్టారా? పెట్టకుండా, దానిపై చర్చ జరగుకుండా ఏకపక్షంగా ఎలా ప్రవేశపెడతారంటూ ప్రశ్నించారు. ప్లాస్టిక్ కవర్ల తయారీపై కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని గుర్తుచేయగా, తీర్మానం పంపిన వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? అసెంబ్లీలో చర్చ జరిగి, నిర్ణయం వచ్చిన తర్వాత నిషేధం అమలవుతుందని మేయర్ సర్దిచెప్పారు.
‘నిపా’పై నజర్ పెట్టాలి
సరికొత్తగా ప్రబలుతున్న నిపా వైరస్ నగరంలో ప్రబలకుండా అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలని మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశించారు. శాసన మండలి సభ్యుడు ఎంఎస్ ప్రభాకర్ రావు సభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, పండ్లను తినటంతో వ్యాపిస్తున్న ఈ వైరస్ ప్రస్తుతం కేరళలో విజృంభిస్తోందని, అక్కడి నుంచి నగరానికి ఎంతో మంది వస్తుంటారని, ఆ వైరస్ నగరవాసులకు ప్రబలకుండా ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించటంతో మేయర్ జోక్యం చేసుకుని హెల్త్, శానిటేషన్ అధికారులు ఈ విషయంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.