హైదరాబాద్

వెయిట్‌లిఫ్టర్ సుకన్యకు మంత్రి పద్మారావు అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: అంతర్జాతీయ మహిళల వెయిట్‌లిఫ్టింగ్ గ్రాండ్ ఫ్రీలో మహబూబాబాద్ జిల్లా కురివి మండలం జగ్య తండాకు చెందిన గిరిజన యువతి తేజావత్ సుకన్యబాయి రజత పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఆర్థిక సహాయం అందించాలని తేజావత్ సుకన్య బాయి తన కోచ్ రాజశేఖర్‌తో కలిసి గురువారం లాల్‌బహదూర్ స్టేడియంలోని శాట్స్ కార్యాలయంలో సంస్ధ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డిని కలిశారు. కోచ్ రాజశేఖర్‌ను తీసుకెళ్లి సచివాలంలో క్రీడల మంత్రి టీ.పద్మారావును కలిశారు. సుకన్య బాయి ఆర్థిక పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సుకన్య ఈనెల 10 నుంచి 13వరకు స్పెయిన్‌లోని తేనెరీఫ్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళల వెయిట్‌లిఫ్టింగ్ గ్రాండ్ ప్రిక్స్‌లో 90 కేజీల విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. తేనెరీఫ్‌లో జరిగిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ మహిళల వెయిట్ లిఫ్టింగ్ గ్రాండ్ ప్రిక్స్‌లో స్నాచ్‌లో 75 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 85 కేజీలు మొత్తం కలిపి 160 కేజీలు బరువు ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. సెప్టెంబర్ మాసంలో పోలాండ్‌లో జరుగనున్న సీనియర్ వరల్డ్ యూనివర్సిటీ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలో పాల్గొనేందుకు శిక్షణలో నిమగ్నమైన సుకన్య భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య నిర్వహించనున్న భారత జట్టు ఎంపిక పోటీలో పాల్గొననున్నది.
నేటి నుంచి రష్యన్ మ్యాజిక్ షో
బేగంపేట్, మే 24: భారత దేశంలో ప్రజలు తన మ్యాజిక్ షోపై అమితాసక్తిని చూపుతు అదరిస్తున్నారని రష్యన్ మెజిషియన్ అలెక్స్ బ్లాక్ అన్నారు. ప్రియ కల్చర్ ఆధ్వర్యంలో నేటి నుంచి జూన్ 3వ తేది వరకు సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్ మ్యాజిక్ షో నిర్వహించనున్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మొదటిసారిగా తాను భారతదేశానికి వచ్చానని బెంగుళురు, చెన్నైలలో ముగించుకుని హైదరాబాద్‌లో షో ఇచ్చేందుకు వచ్చినట్లు చెప్పారు. 15 రకాల ఐటమ్స్ 75 నిమిషాల పాటు ఈ షో కొనసాగుతుందన్నారు. నిర్వహకుడు కార్తిక్ మాట్లాడుతూ.. ప్రతి రోజు సాయంత్రం 7:30 గంటలకు, శని, ఆదివారల్లో రెండు షోలు 4:30 నుంచి 7:30 గంటల వరకు ఉంటాయని తెలిపారు. బుక్ మై షో ద్వారా, నేరుగా హరిహరకళాభవన్‌కు వచ్చి టికెట్లు బుక్ చేసుకోవచ్చునని చెప్పారు. వివారలకు 8977448874 నంబర్‌ను సంప్రదించవచ్చని చెప్పారు.