హైదరాబాద్

ఓయూ డిగ్రీ ఫలితాలు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం: ఓయూ డిగ్రీ పరీక్షల ఫలితాలను వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం, రిజిస్ట్రార్ సీహెచ్ గోపాల్ రెడ్డి, పరీక్షల కంట్రోలర్ కుమార్ విడుదల చేశారు. వీసీ రామచంద్రం మాట్లాడుతూ బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ కోర్సుల్లో 63529 మంది పరీక్షలకు హాజరవగా 36273 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. డిగ్రీ పరీక్షల్లో 57.10 శాతం నమోదు కాగా 66.05 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. బాలురు 46.97 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులో సిలబస్ మారుతుందని పేర్కొన్నారు. ఓయూ పరీక్ష విధాన పూర్తిగా సీబీసీఎస్ విధానం అమలుకానుందని వివరించారు. ఓయూ పరిధిరలో బీఏలో 5604 మంది పరీక్షలకు హాజరవగా 68.27 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. బీకాంలో 36963 మంది హాజరవగా 64.21 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. బీఎస్సీలో 19324 మంది హాజరుకాగా 37.65 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. రివాల్యువేషన్ కోసం జూన్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నందిని సిధారెడ్డికి పురస్కారం ప్రదానం
కాచిగూడ, మే 24: ప్రముఖ సాహితీవేత్త డా.పల్లాదుర్గయ్య 103వ జయంతి సందర్భంగా ప్రముఖ రచయిత తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డికి ‘డా.పల్లా దుర్గయ్య సార్మక’ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం మానస ఆర్ట్స్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ విశ్రాంతచార్యులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య పాల్గొని నందిని సిధారెడ్డికి పురస్కారం ప్రదానం చేశారు. పల్లా దుర్గయ్య అనేక ప్రక్రియాల్లో రచనలు చేశారని కీర్తించారు. ప్రముఖ సాహితీవేత్త డా.సంగభట్ల నర్సయ్య సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, గండ్ర లక్ష్మణ రావు, మడిపల్లి దక్షిణామూర్తి, శ్యామసుందర్, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్ర రావు, రఘుశ్రీ పాల్గొన్నారు.