హైదరాబాద్

బాలికల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లాలో బాలికల పరిరక్షణకు ప్రత్యేక కార్యచరణను సిద్దం చేస్తున్నట్లు కలెక్టర్ యోగితారాణా వెల్లడించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ, కూకట్‌పల్లి అల్విన్‌కాలనీల్లోని జువైనల్, స్టేట్ హోంమలను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ నింబోలిఅడ్డాలోని కేంద్రంలో 62 మంది బాలికలు వసతి పొందుతున్నారని, వారికి ఉపాధి కల్పించేందుకు బ్యూటీషియన్, టైలరింగ్‌తో పాటి ఒకేషనల్ కోర్సులను నిర్వహించేందుకు క్యాప్ ఫౌండేషన్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. యూసుఫ్‌గూడ చిల్డ్రన్స్ హోమ్‌లో 1వ కేంద్రంలోని 219 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నట్లు, వారిలో 129 మంది బాలికలు, మిగిలిన వారు బాలురు ఉన్నట్లు తెలిపారు. వారికి ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యనందిస్తున్నట్లు తెలిపారు. పిల్లలతో జిల్లా కలెక్టర్ ముచ్చటించి, అక్కడ వారికి అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. యూసుఫ్‌గూడలోని 2వ చిల్డ్రన్స్ హోమ్‌లో 77 మంది బాలికలు, 34 మంది బాలులు ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు. ఇదే హోమ్‌లో రోజుల వయస్సు గల శిశువు నుంచి ఒక సంవత్సరంలోపు వయస్సు ఉన్న 87 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లోని పిల్లలందరి హెల్త్ ప్రొఫైల్‌ను నిర్వహించాలని, రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించి రక్తహీనతను నివారించేందుకు అదనపు పోషకాహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది హాజరును బయోమెట్రిక్ ద్వారా మానిటరింగ్ చేయాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పసి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రత్యేకంగా సూచించారు. యూసుఫ్‌గూడ చిల్డ్రన్స్ హోమ్ పిల్లల సంరక్షణకు సొలార్ వాటర్ హీటర్ ఆర్‌ఓ మంచినీటి ప్లాంట్, బోర్‌వెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను బదిలీ చేయించనున్నట్లు తెలిపారు. వాననీటి సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కూకట్‌పల్లి ఆల్విన్‌కాలనీలోని రెస్క్యు స్టేట్ హోంలో ఉన్న 59 మందికి అక్కడ అందుతున్న సేవల గురించి కలెక్టర్ తెలుసుకున్నారు.
తనిఖీల్లో బాలల సంరక్షణ కమిటీ చైర్ పర్సన్ శ్యామలాదేవీ, సభ్యులు కమల, అన్నపూర్ణ, జిల్లా సంక్షేమ అధికారి సునంద, బాలిక సంరక్షణ అధికారి ఇంతియాజ్, సర్వశిక్ష అభియాన్ ఈడీ భాస్కర్, డీఈఓలు మధు, దేవిదాస్ ఉన్నారు.