హైదరాబాద్

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: మైసూర్ దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదినం పురస్కారించుకుని బాల సచ్చిదానందం చిన్నారులచే ‘సంగీత, నృత్య, వాద్య’ ప్రదర్శన శుక్రవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని చిన్నారులను అభినందించి సత్కరించారు. చిన్నతనం నుంచే కళ రంగంలో రాణించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. సభకు ముందు చిన్నారులు ప్రదర్శించిన పలు సంస్కృతిక నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రసమయి అధినేత డా. ఎంకే రాము, శంకరం వేదిక అధ్యక్షుడు డా.యలవర్తి రాజేంద్ర ప్రసాద్, గాయనీ సురేఖామూర్తి, శశికళా స్వామి, రత్నాకర శర్మ పాల్గొన్నారు.

జీవితంలో సైన్స్‌కు ఎంతో ప్రాధాన్యత
కాచిగూడ, మే 25: ప్రతి మనిషి జీవితంలో ఆధ్యాత్మికత, సైన్స్‌ను రెండు ఎంతో అవసరమని బుషి జీవన్ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పచ్చిపులుసు మదన్ గుప్త అన్నారు. శిఖరం ఆర్ట్స్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘పురాతన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ’ అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం శుక్రవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మదన్ గుప్త మాట్లాడుతూ భారతీయ విద్యా విధానం గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. వేదాల నుంచి వైజ్ఞానిక విశేషాలు వెలువడ్డాయో వివరించారు. కార్యక్రమంలో లక్ష్మణారేఖ గోపాల కృష్ణ, టీ.చక్రపాణి, గొల్లకృష్ణ పాల్గొని మదన్‌గుప్తను అభినందించి సత్కరించారు.