హైదరాబాద్

నగర అధ్యక్షుడిగా అంజన్‌కుమార్ యాదవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న క్యాడర్‌ను పట్టించుకోని నగర కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో ఆ పార్టీ అధిష్టానం సంచలనాత్మకమైన మార్పు చేసింది. గతంలో అధికారికంగా నగర అధ్యక్షుడిగా మాజీ మంత్రి దానం నాగేందర్ కొనసాగినా, ఆ తర్వాత ఆయన్ను అధికారికంగా పార్టీ నియమించకపోవటంతో అసలు నగర కాంగ్రెస్‌ను ముందుండి నడిపించేదెవరు? అన్న అనుమానాలకు సైతం తెరదింపుతూ ఆ పార్టీ మాజీ ఎంపీ ఎం.అంజన్‌కుమార్ యాదవ్‌ను నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది. రెండుసార్లు సికిందరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన అంజన్‌కుమార్ గతంలో 2005లో కూడా నగర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.