హైదరాబాద్

గల్ఫ్ బాధితులను ఆదుకోండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ రాష్ట్రంలో కరువు తాండవించటంతో అనేక మంది పేద రైతులు బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాల బాట పడుతున్నారని, అక్కడకు వెళ్లిన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని తెలంగాణ శాసన మండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. బుధవారం శాసన మండలిలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వివరణ కొనసాగుతున్న సమయంలో షబ్బీర్ అలీ జోక్యం చేసుకుని ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ అనేక మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులు ఉపాధి అవకాశాల కోసం కొట్టుమిట్టాడుతూ గత్యంతరం లేక గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని తెలిపారు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత అక్కడ పనిచేయాల్సిన తీరుతెన్ను, అక్కడి పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించాల్సిన పద్దతిపై వీరికి అవగాహన లేకపోవటంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో కరువు, అనావృష్టి ఎక్కువగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులను రాబట్టుకోక పోవటమే వలసలకు ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో నిరుద్యోగులు పెరిగిపోవటంతో పాటు ఆకలి చావుకేకలతో అలమటిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గల్ఫ్ దేశాలకు వెళ్తున్న తెలంగాణ యువకులకు వారికి నచ్చిన అంశాలైన ఎలక్ట్రీషియన్, ప్లంబర్ ఇతరత్ర ట్రేడ్‌లలో ప్రభుత్వ పరంగా తగిన శిక్షణనిచ్చి, వారిని నిష్ణాతులను చేస్తామని తెలిపారు. ఈ విషయంలో త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటామని సభలో మంత్రి ఈటల సభ్యులకు హామీ ఇచ్చారు.