హైదరాబాద్

ప్రగతి పథంలో తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ: కోట్లాది రూపాయాల పనులతో తెలంగాణను అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు అన్నారు. శుక్రవారం కూకట్‌పల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ నిజాంపేట రోడ్డులోని కొలను రాఘవరెడ్డి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మన నగరం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజలు కలలో కూడా వూహించని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు పరిచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు రోజు విడిచి రోజు అందించనున్నామని తెలిపారు. తాగునీటి సమస్య తలెత్తిన ట్యాంకర్లతో ప్రజల దాహార్తిని తీరుస్తామని చెప్పారు. ప్రజలకు అత్యంత ఆహ్లాదాన్ని అందించే పార్కులు, చెరువుల అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామని అన్నారు. తడి, పొడిగా వేరు చేసిన చెత్తను కంపోస్టు ఎరువులుగా తయారు చేసి కూరగాయాలు, పూల మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దిన్, జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, చిరంజీవులు, జోనల్ కమిషనర్లు హరిచందన, శంకరయ్య, కార్పొరేటర్లు కాండూరి నరేంద్ర ఆచార్య, పండాల సతీష్‌గౌడ్, ముద్దం నర్సింహ యాదవ్, నాయకులు, సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.