హైదరాబాద్

భూగర్భ జలాల పరిరక్షణపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాబోయే తరాలకు మంచినీటి కొరతను తగ్గించేందుకు జలమండలి ఓ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయిదారు దశాబ్దాల క్రితం నగరంలో పర్యావరణ పరంగా ఉన్న పరిస్థితులు, అప్పట్లో ఉన్న భూగర్భ జలాలు, చెరువులు, కుంటలు, పచ్చదనం వంటి అంశాలను నేటి తరం వారికి తెలియజేసి, వారిని చైతన్యవంతులను చేసేందుకు శనివారం జలమండలి బోర్డు ప్రధాన కార్యాలయంలో నీటి పొదుపుపై పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్స్ వర్క్‌షాపును నిర్వహించారు. నాటి తరం యువకులు నేటి తరం వారికి తాతయ్యలుగా భూగర్భ జలాల పరిరక్షణకు స్పందించాల్సిన తీరును వివరించారు. తక్షణమే కళ్లు తెరవకపోతే ముందు తరాలకు మంచినీరు పెద్ద సమస్యగా మారనుందని హెచ్చరించారు. అయిదారు దశాబ్దాల క్రితం ఎండలు మండిపోతున్నా, ఇరవై నాలుగు గంటల పాటు మంచినీటి సరఫరా అందుబాటులో ఉండేదని, ఎక్కడ చూసిన పచ్చదనం, చెరువులు, కుంటలు జలంతో నిండి కన్పించేవని, కాలక్రమేణా పరిస్థితి ఇపుడు అందుకు భిన్నంగా తయారైందని కొందరు సీనియర్ సిటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా జలమండలి మొట్టమొదటి సారిగా నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో జలమండలి ఎండీ దాన కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు, చిన్నపిల్లలకు ఇంకుడు గుంతలు, నీటి ఆదాపై అవగాహన కల్పించేంకు గ్రాన్ పేరెంట్, గ్రాండ్ చిల్డ్రన్స్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వీరితో కలిపి వాటర్ క్లబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఔటర్ రింగురోడ్డు పరిధిలో మొత్తం 500 వాటర్ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. నీటి పొదుపును కూడా ప్రజలు ఒక ఉద్యమంగా భావించాలని ఆయన సూచించారు. నగరంలో సుమారు 23వేల 700 అపార్ట్‌మెంట్లున్నాయని, వీటి ఒక్కోదానిలో వంద మంది చొప్పున కొన్ని లక్షల మందికి నీటి పొదుపు, నీటి సంరక్షణపై అవగాఋహన ఏర్పడుతుందని తెలిపారు. అలాగే వారసుకు మన ఆస్తిపాస్తులను పంచుతున్నామే గానీ, రేపటి తరాలకు తాగునీరు ఇస్తే చాలన్న రోజులు రావచ్చునని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జలం-జీవం పేరుతో నీటి పొదుపు వాననీటి సంరక్షణపై 14 స్వచ్చంద సంస్థల సహకారంతో విస్త్రృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. గత ఆరేడు దశాబ్దాల క్రితం పుష్కరమైన నీటిని చూసిన పెద్దలు, ప్రస్తుతం చుక్క నీటి కోసం చుక్కలు చూడాల్సిన పరిస్థితులను నేటి తరం పిల్లలకు వివరిస్తే నీటి విలువను వారు తెల్సుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, జలమండలి రిటైర్డు ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగ్‌రావు, కో ఆపరేటీవ్ శాఖ రిటైర్డు అధికారి బీపీ దూబే, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ సూర్యనారాయణ, ఇంకుడు గుంతల ప్రత్యేకాధికారి జె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.