హైదరాబాద్

పొగాకు కాదు..పగాకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: పొగ తాగేవారి కన్నా పొగను పీల్చే వారి ప్రాణాలకు హాని ఎక్కువగా ఉంటుందని డాక్టర్ రావూస్ ఓరల్ హెల్త్‌పౌండేషన్ డాక్టర్ ఓ.నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం గాంధీ ఆసుపత్రిలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మే 1 నుంచి 31వ తేది వరకు పలు ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులు సేవించడంవల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇందులో భాగంగా గాంధీ ఆసుపత్రిలో అవగాహన ర్యాలీ నిర్వహించామని వివరించారు. పొగాకు మహమ్మారిని పూర్తిగా ప్రజల మధ్య నుంచి పారదోలడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చట్టాలను తీసుకువచ్చి వాటిని అమలు చేయాలని, అదే సమయంలో స్వచ్ఛంద సంస్థలు సామాజిక కార్యకర్తలు కూడ ప్రజల ప్రాణాలను క్యాన్సర్ రూపంలో హరిస్తున్న పొగాకు మహమ్మారిని పారదోలడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా విరివిగా ప్రచారం కల్పించడంతోపాటు ప్రజలకు దీనివల్ల కలిగే అత్యంత భయానకమైన అనర్థాలను వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పొగాకును సేవించే వారికన్నా ఆ పొగను పీల్చే అమాయకులే ఎక్కువగా బలయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. గుట్కా, పాన్‌పరాగ్, సిగరెట్లు సేవించడం ద్వారా అనేకమంది చిన్నపిల్లలు సైతం బలవుతున్నారన్నారు. గత 23 సంవత్సరాలుగా గాంధీ ఆసుపత్రిలో నోటి క్యాన్సర్ ద్వారా చాలామంది చనిపోవడం చూశామన్నారు. తాను చేస్తున్న ఈ అవగాహన, ప్రచార కార్యక్రమాల ద్వారా లక్షల్లో వేలమందిలో పరివర్తన తీసుకువచ్చినా తాను విజయం సాధించినట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, బిసి సంఘం నాయకుడు, గాంధీ ఆసుపత్రి రోగుల సహాయకుడు క్రిష్ణపూజారి మాట్లాడుతూ డాక్టర్ నాగేశ్వర్‌రావు గాంధీలో సుదీర్ఘకాలంగా రోగులకు సేవలందించడమే కాదు వయసును సైతం లెక్కచేయకుండా మండుటెండలో నగరంలోని ఆసుపత్రుల కూడళ్లలో పొగాకుకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజీవ్‌నాయక్, సుఖేశ్ తదితరులు పాల్గొన్నారు.