క్రైమ్/లీగల్

కుటుంబ తగాదాలతో బావపైనే పరోక్ష దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, జూన్ 6: కుటుంబ తగాదాల కారణంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతవరకైనా వెళ్లడానికి సిద్థపడుతున్నారు. నేరం నిరూపించబడి కటకటాల పాలై విలువైన జీవితాన్ని జైలుపాలు చేసుకుని నేరచరితులుగా సమాజంలో మిగిలిపోతున్నారు. ఇందుకు ఉదాహరణ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన గోపాలపురం ఏసీపీ శ్రీనివాస్ కథనం ప్రకారం.. అంబర్‌నగర్‌కు చెందిన కే.నరేశ్‌కుమార్(32) మే నెల 23వతేదిన రాత్రి సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి 23వతేదిన తెల్లవారు ఝామున 1.30 గంటల సమయం లో రామంతపూర్‌కు చెందిన తన బావమరిది ఆర్.శ్రీనివాస్(32)తో కలిసి బౌద్దనగర్‌లోని తన బంధువుల ఇంటిలో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లి ఇద్దరు తిరిగి వస్తుండగా జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ ప్రాంతంలో మూత్రవిసర్జన కోసం తమ మోటార్‌బైక్‌ను ఆపిన సమయంలో వెనక వైపు నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చి తమపై విచక్షణా రహితంగా దాడిచేసి తమ వద్ద ఉన్న రెండు విలువైన మొబైల్ ఫోన్‌లను లాక్కుని కింద పడేసి పారిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఫిర్యాదు స్వీకరించిన చిలకలగూ డ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో పోలీసులకు ఆసక్తి కరమైన విషయాలు వెల్లడయ్యా యి. విచారణ పూర్తి చేసిన పోలీసులు ఫిర్యాదు దారుడు నరేశ్‌కు స్వయాన భార్య సోదరుడైన తన బావమరిది ఆర్.శ్రీనివాస్ ప్రధాన నిందితుడుగా తేల్చారు. శ్రీనివాస్ తన సోదరికి తన బావకు మధ్య ఏర్పడిన తగాదాల నేపథ్యంలో కక్షను పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవడానికి తన స్నేహితుల సహాయం తీసుకుని దాడికి తెగబడి, గుర్తుతెలియని దొంగల చేసిన దాడిగా చిత్రీకరించాలని ప్రయత్నించి అడ్డం గా దొరిగిపోయాడు. ముందు వేసుకు న్న పథకం ప్రకారం శ్రీనివాస్ తన స్నేహితులు ముషీరాబాద్‌కు చెందిన పూస కిరణ్ (28), అదే ప్రాంతానికి చెందిన పిట్లమహేశ్ (22), రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన పాల్ అలియాస్ మింటు (28)తో తన బావపై దాడి చేయడానికి పన్నాగాన్ని రచించి తమ బంధువుల ఇంటిలో ఫంక్షన్ అయిపోగానే తాము ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో జామై ఇస్మానియా రైల్వేస్టేషన్ ప్రాంతానికి రాగానే మూత్ర విసర్జన కోసం ఆగే విధంగా చూస్తామ ని ఇంతలో పథకాన్ని అమలు చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. చిలకలగూడ డీఐ నర్సింహరాజు, ఎస్‌ఐ వెంకటాద్రి దర్యాప్తు జరిపి నిందితులు శ్రీనివాస్‌ను, మింటును అదుపులోకి తీసుకుని వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలను, రెండు విలువైన పోన్‌లను, రు.4000వేల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. మిలిగిన వారి కోసం గాలిస్తున్నట్లు బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో గోపాలపురం ఏసీపీ కే.శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు.

ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ దాడులు
కొందుర్గు, జూన్ 6: రైతులకు ఎరువులు విక్రయించే దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం కొందుర్గు మండల కేంద్రంలోని ఎరువులు విక్రయించే దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. విజిలెన్స్ అధికారులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న కొంతమంది ఎరువుల దుకాణం యజమానులు షాపులను బంద్ చేసి వెళ్లిపోయారు. కొన్ని దుకాణాల్లో మాత్రమే విజిలెన్స్ అధికారులు రికార్డులను పరిశీలించి పీఓఎస్ యంత్రాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎరువులు కొనుగోలు చేసే రైతుల ఆధార్ నంబర్‌ను పీఓఎస్ యంత్రంతో అనుసంధానం చేసిన తరువాతే ఎరువులు విక్రయించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే డీలర్ల లైసన్స్‌ను రద్దు చేయడంతోపాటు తగిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఎరువులు, విత్తనాలు పక్కదారి మళ్లీంచకుండా రైతులకు అవసరం ఉన్న మేరకు సరఫరా చేసేందుకు డీలర్లు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడంతోపాటు రసీదులు తీసుకోవాలని రైతులకు సూచించారు.