హైదరాబాద్

బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, మార్చి 31: మానసిక వ్యధతో బిటెక్ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కెపిహెచ్‌బి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజాంపేట్ రోడ్డులోని గోకరాజు రంగరాజు కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి(18) స్థానిక త్రివేణి లేడీస్ హాస్టల్‌లో ఉంటుంది. గురువారం ఉదయం తన హస్టల్ రూంలో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్ధులు హస్టల్ రూమ్‌కు వచ్చి చూసేసరికి శ్రావణి ఉరివేసుకొని మృతిచెందడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తన చావుకు ఎవరు కారణం కాదని మానసిక బాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శ్రావణి రాసిన సూసైడ్ నోటును పోలీసుల స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నారు.