హైదరాబాద్

మున్సిపల్ కార్యాలయంలో బదిలీల హల్‌చల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జూన్ 12: ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల బదిలీల పర్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో తాండూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచి తమకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీపై వెళ్లేందుకు కసరత్తులు ప్రారంభించారు. వారం రోజులుగా కొనసాగుతున్న మన్సిపల్ అధికారులు, సిబ్బంది బదిలీల కౌన్సిలింగ్‌లకు తాండూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న దాదాపు అర డజను మంది సిబ్బంది బదిలీల కోసం దరఖాస్తులు చేసుకొని ఆర్డర్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. నేడో రేపో మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికార యంత్రాంగం నుంచి బదిలీలకు సంబంధించిన ఆదేశాలు వెలువడనున్నట్లు మున్సిపల్ అధికార వర్గాల సమాచారం. తాండూరు మున్సిపాలిటీలో గత కొన్ని సంవత్సరాల నుంచి అధికారులు, సిబ్బంది కొరత పాలక వర్గాన్ని వేధిస్తుంది. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న కొద్ది మంది అధికారులు, సిబ్బంది బదిలీ చేసుకొని వెళ్లడానికి సిద్ధ కావటం పట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ బీ.సునీతా సంపత్ తన నిరాసక్తతలను వెలుబుచ్చుతున్నారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చాలా కాలంగా లాంగ్ స్టాండింగ్ సిబ్బంది కొందరు పలు అవినీతి ఆరోపణల అభియోగాలు ఉన్నవారు సైతం ప్రభుత్వం కల్పించిన బదిలీల అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడి నుంచి ఫలాయనం చిత్తగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్‌లో మేనేజర్ ఎ.రాములు గద్వాలకు బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేసి సఫలీకృతుడైనట్లు సమాచారం. మున్సిపల్ డీఈఈ శివానంద్ గత నాలుగున్నర నెలల క్రితమే తాండూరు మున్సిపాలిటీలో విధులు చేపట్టారు. అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో తన సొంత ప్రాంతం నిజామాబాద్ జిల్లాకు బదిలీ అవుతున్నట్లు తెలుస్తోంది. కార్యాలయంలో సినియర్ అసిస్టెంట్‌లుగా పని చేస్తున్న జంగయ్య, శ్రీకాంత్ వికారాబాద్ మున్సిపల్‌కు బదిలీ అవుతున్నట్లు సమాచారం. జూనియర్ అసిస్టెంట్‌లు బి.రమేష్, విఠల్‌లు సైతం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయానికి బదిలీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరో జూనియర్ అసిస్టెంట్ కుమార్.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి బదిలీ అయినట్లు సమాచారం. బిల్ కలెక్టర్ రామకృష్ణ సహా మరికొందరు బిల్ కలెక్టర్ బదిలీకి రంగం సిద్దం చేసుకున్నారు. సిబ్బంది కొరతతో పట్టణ ప్రజల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలం చెందుతున్న తాండూరు మున్సిపల్‌లో శాశ్వత ఉద్యోగులు, సిబ్బంది చాలా మంది బదిలీపై వెళ్తే ఇక మిగిలేది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే నని పలువురు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు, మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతా సంపత్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బదిలీ అయిన అధికారులు, సిబ్బంది స్థానంలో కొత్త వారిని వీలైనంత తొందరగా భర్తీకి మున్సిపల్ ఉన్నతాధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తామని చైర్‌పర్సన్ మంగళవారం తమ ఛాంబర్‌లో వెల్లడించారు.