హైదరాబాద్

హెచ్‌ఎండీఏకు ప్రధాన ఆదాయ వనరు.. ఓఆర్‌ఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 12: ఔటర్ రింగ్‌రోడ్డు పథకం హెచ్‌ఎండీఏకు ప్రధాన ఆదాయ మార్గంగా రూపుదిద్దుకుంటుంది. ఔటర్ రింగ్‌రోడ్డుతో వాహన రాకపోకలతో టోల్ రూపేణా గత ఏడాది వార్షిక ఆదాయం రూ.191 కోట్లకు పైగా రావడంతో సంస్థ మరింత బలోపేతంగా తయారు కావడానికి కారణమవుతోంది. ప్రస్తుతం తాజాగా టోల్ వసూలు ప్రక్రియకు టెండర్ పిలువగా ప్రతి నెల 26 కోట్ల చొప్పున ఏడాదికి రూ.312 కోట్లు పలికింది. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కలల్ని సాకారం చేయడంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు నిరంతరం కృషి చేస్తున్నారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశాలతో కమిషనర్ ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అలవంభిస్తూ నాలుగు వందల ఏళ్లకు పైగా సాంస్కృతిక చరిత్ర కల్గిన హైదరాబాద్‌ను నిత్య నూతనంగా ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకుంటూ ప్రపంచ స్థాయి పౌర సేవలను అందించడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. హరితహారం అమలులో సైతం మరో ముందడుగు వేస్తున్నారు. ఓఆర్‌ఆర్‌కు ఇరువైపుల పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడంలో విశేష కృషి చేసి ముఖ్యమంత్రి మన్నలను అందుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఓఆర్‌ఆర్ చుట్టూ పచ్చని మొక్కలు పెంచడానికి ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రయాణం చేసే వారికి కొత్త అనుభూతిని కల్పించడానికి ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించడంలో తనదైన ముద్ర వేశారు. ఓఆర్‌ఆర్ పథకం పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించి అనతికాలంలోనే పెండింగ్‌లో ఉన్న ఘట్‌కేసర్, మేడ్చల్, కండ్లకోయ వద్ద పనులను పూర్తి చేయించారు. ఈ రెండు కూడళ్ల ఏర్పాటుతో ఓఆర్‌ఆర్ నిర్మాణం సంపూర్ణంగా వినియోగంలోకి వచ్చినట్లయింది. ఫలితంగా జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ రహదారుల నుంచి వచ్చే వాహనాలను నేరుగా నగరంలోకి ప్రవేశించకుండా ఓఆర్‌ఆర్‌తో తమ గమ్యస్థానానికి చేరే వీలు కల్పించారు. ఇదిలా ఉండగా ఓఆర్‌ఆర్ పథకాన్ని అస్పేట్ రీసైక్లింగ్ నూతన పద్ధతి ద్వారా హెచ్‌ఎండీఏ రూ.2500 కోట్లు తీసుకురావాలని కమిషనర్ చిరంజీవులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పథకాన్ని సంస్థ బోర్డులో పెట్టి సమగ్ర చర్చ జరిపించి సూచనప్రాయంగా అనుమతి పొందారు. దీంతో రీసైక్లింగ్‌లో భాగంగా టోల్ వసూలు లీజుకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టెండర్ ద్వారా లీజు కేటాయించి తద్వారా అడ్వాన్సుగా తీసుకునే నిధులతో సంస్థ పరిధిలోని ఇతర భారీ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ-టెండర్ ప్రక్రియ ద్వారా రూ.2500 కోట్ల నిధులను సమీకరించుకోవడానికి అంచనా వేశారు. టోలు టాక్స్ వసూలు ప్రక్రియను ప్రపంచ స్థాయిలో ఉండేటట్లుగా అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్వహణ కార్యకళాపాలు జరిపేందుకు టోలు మేనేజ్‌మెంట్ సిస్టమ్ (టీఎంఎస్)ను ఏర్పాటు చేశారు. టీఎంఎస్‌తో ఖచ్చితమైన టోలు వసూలు వాహనాల రాకపోకల సంఖ్య గణాంకాల వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. దీంతో టోలు వసూల్‌లో జరిగే అవకతవకలకు తావులేకుండా కచ్చితమైన నమోదు జరుగుతోంది. ప్రస్తుతం టోలు మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా టోలు వసూలుతో వచ్చే ఆదాయం ప్రతి నెలా రూ.27కోట్లు ఓఆర్‌ఆర్ నిర్వహణ, అభివృద్ధికి కేటాయించారు. గతంలో ప్రతి నెలా సుమారు రూ.16 కోట్ల చొప్పున ఏడాదికి రూ.191 కోట్లకు పైగా ఆదాయం వస్తుండేది. తాజాగా నిర్వహించిన టెండర్ ప్రక్రియ ద్వారా ప్రతి నెలా రూ.26 కోట్ల చొప్పున ఏడాదికి రూ.312 కోట్లకు ఆదాయం పెరిగింది. ఓఆర్‌ఆర్ పథకం వివరాలు ఇలా ఉన్నాయి. ఓఆర్‌ఆర్ రోడ్డు పొడవు మొత్తం 158 కిలో మీటర్లు, ఎనిమిది లైన్ల రోడ్లతో 120 కిలో మీటర్ల వేగ పరిమితి, ఇరువైపుల సర్వీసు రోడ్లు రెండు, ఇంటర్ చేంజెస్ (కూడళ్లు) 18, ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఔటర్ రింగ్‌రోడ్డును కలుపుతూ 33 రేడియల్ రోడ్లు, పథకం వ్యయం రూ.6696 కోట్లు ఉంటుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద రింగ్‌రోడ్డు
* కమిషనర్ చిరంజీవులు
హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు ప్రపంచంలోనే మొట్ట మొదటిది. హైదరాబాద్ నగరం చుట్టూ బాహ్యవలయ రహదారి ప్రపంచంలోనే ఏ నగరానికి లేదని కమిషనర్ టి.చిరంజీవులు అన్నారు. ఈ రహదారితో నగరంలో వాహనాల రద్దీ తగ్గడం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు ఇరువైపుల ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో గ్రోత్ కారిడార్‌ను ఏర్పాటు చేశామని, ఈ కారిడార్ ప్రత్యేక అభివృద్ధి ప్రాంతంగా పరిగణించి తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ ప్రశంసలు
గత రెండున్నరేళ్ల కింద ఆర్ధికంగానేకాక ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా చతికిలపడిపోయిన హెచ్‌ఎండీఏను కమిషనర్ చిరంజీవులు బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు నూతన సంస్కరణలు చేపట్టారు. ఆర్ధిక ఇబ్బందులతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న హెచ్‌ఎండీఏను కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొని అభివృద్ధి పథం వైపు సంస్థను ముందుకు తీసుకొచ్చారు. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో హెచ్‌ఎండీఏలో పలు వినూత్న కార్యక్రమాలను చేపట్టారు. సాధ్యమైనంత మేరకు అవినీతిని తగ్గించి మెరుగైన పౌర సేవలను అందించడంలో అతిశయోక్తిలేదు. దేశంలోనే మొదటి సారిగా డెవలప్‌మెంట్ పర్మిషన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్)ను ఆన్‌లైన్ పద్ధతిని ప్రవేశపెట్టి ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర పురపాలికలు కూడా పాటిస్తున్నాయి. కోకపేట వివాదం, ఐటీ మినహాయింపు దశాబ్ద కాలంగా వివాదాస్పదంగా ఉండిపోయిన ఉప్పల్ భగాయత్ రైతుల సమస్య లాంటి పలు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో కమిషనర్ చిరంజీవుల కృషిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందించారు.