హైదరాబాద్

లష్కర్‌లో వాననీటి కష్టాల నివారణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, జూన్ 12: వానాకాలంలో ప్రజలు ఇబ్బందులు పాలుకాకుండా యుద్ద ప్రాతిపదిక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పద్మారావు పేర్కొన్నారు. మంగళవారం సికిందరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తార్నాక డివిజన్‌లోని లాలాపేట్, ఇందిరానగర్, చంద్రబాబునాయుడు నగర్, సిరిపురి కాలనీల్లో ఆయన ఓపన్ నాలాల్లో పూడికతీత పనులను స్వయంగా తనిఖీలు చేసి పర్యవేక్షించారు. స్థానికంగా పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీసంఘాలు, బస్తీపెద్దలతో ముఖాముఖి చర్చించారు. దీంతో స్థానికులు పెద్దఎత్తున సమస్యలను ఏకరవు పెట్టారు. మంత్రి ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి అక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. భారీ వర్షాలకు సైతం ప్రజలు ఇబ్బందులు పడుకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. నిధుల కొరత లేదని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని పరిష్కరించాలన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల స్వల్పవ్యవధిలో 50 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగలిగామని మంత్రి వివరించారు. సికిందరాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మురికివాడలు సమస్యల వలయంగా ఉన్నాయని, నాలుగు సంవత్సరాల కాలంలో నిధులకు వెనకంజ వేయకుండా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్‌లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణాలు తుదిదశలో ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో తాము ఇచ్చిన హామీలనే కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్‌లో ప్రజలు ఇబ్బందులు పడుకుండా ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి, జిహెచ్‌ఎంసీ డిప్యూటీ కమీషనర్ రవికుమార్, జలమండలి జనరల్ మేనేజర్ సుదర్శన్, ఈఈ ఇందిరా బాయితోపాటు రెవెన్యూ, విద్యుత్ అధికారులు, గ్రేటర్ తెరాస యువజన విభాగపు అధ్యక్షుడు ఆలకుంట హరి, సునిల్ ముదిరాజ్ పాల్గొన్నారు.

వానొచ్చే
సికిందరాబాద్, జూన్ 12: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. సాయంత్రం ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకు వెళ్లే సమయాల్లో సాధారణంగా రోడ్లన్నీ కిక్కిరిసి ఉంటాయి. దీనికితోడు సాయంత్రం సమయంలో ఒక్కసారి కురిసిన వర్షానికి ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్లపై నిలిచిన వాన నీటితో వాహనాలు గంటల తరబడి ఎక్కడికక్కడ ఆగిపోయ ట్రాఫిక్ స్తంభించింది. సికిందరాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు నగర శివారు ప్రాంతాల్లో అరగంట కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. డ్రేనేజీలు పొంగిపొర్లాయి. సికిందరాబాద్ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు నిండిపోయాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు వర్షంలో తడుస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నిలిచిన వాననీటిని పంపించడానికి ట్రాఫిక్ పోలీసులతో పాటు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది శ్రమించారు. వర్షాకాలం సమీంచక ముందే నాలాల్లో పూడిక తీయాల్సిన జిహెచ్‌ఎంసీ.. చాలా ప్రాంతాల్లో ఆ ప్రయత్నాలు చేయకపోవడంతో చెత్తపేరుకుపోయి చిన్నపాటి వర్షాలకు ఓపెన్‌నాలాలు పొంగి పొర్లుతున్నాయి. సికిందరాబాద్‌లోని పలు బస్తీలను ముంచెత్తే ఈ నాలాల చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం తూతూ మంత్రపు చర్యలతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు.