హైదరాబాద్

తహశీల్దార్ ఆఫీసుల్లో పనిచేయని ‘్ధరణి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూన్ 12: నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో వచ్చిన తప్పులను సరిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘్ధరణి’ వైబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ధరణి వైబ్‌సైట్ ఏర్పాటుచేసి తహశీల్దార్ కార్యాలయాలకు అనుసంధానం చేశారు. రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్లలో ధరణి వెబ్‌సైట్ ఏర్పాటు చేసినప్పటి నుండి ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రెవెన్యూ కార్యాలయానికి ఎప్పుడు వచ్చినా సర్వర్ డౌన్ కావడంతో ఆన్‌లైన్ రావడం లేదంటూ అధికారులు చెబుతున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు అంటున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో ‘్ధరణి’ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. వైబ్‌సైట్ ప్రారంభించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా నేటివరకు ఒక్కరోజు కూడా సక్రమంగా పనిచేసిన దాఖలాలు లేవని వివిధ గ్రామాల రైతులు ఆరోపించారు. చాలామంది రైతులకు సంబంధించిన భూముల వివరాలను నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో అధికారులు సక్రమంగా పొందుపరచక పోవడంతోనే అనేక సమస్యలు తలెత్తాయని చెప్పవచ్చు. పాస్‌పుస్తకాల్లో వచ్చిన తప్పుల కారణంగా రైతులకు రైతుబంధు చెక్కులను సైతం ఇవ్వలేదని అన్నదాతలు పేర్కొంటున్నారు. నూతన పాస్‌పుస్తకా లు ఎప్పుడు ఇస్తారంటూ అన్నదాతలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం తప్పడం లేదని అంటున్నారు. పాత పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్, ఆర్‌ఓఆర్ పత్రాలు జిరాక్స్ తీసి అధికారులకు ఇచ్చి వెళ్తున్నామే తప్ప కొత్త పాస్‌పుస్తకాల్లో వచ్చిన తప్పులను మాత్రం సరిచేయడం లేదని వాపోతున్నారు. నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో వచ్చిన తప్పులను సరిచేసేందుకు రెవెన్యూ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల రైతులు కోరుతున్నారు.

పాస్‌పుస్తకాల్లో అన్నీ తప్పులే
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో అన్నీ తప్పులే వచ్చాయని ఫరూఖ్‌నగర్ మండలం చించోడు గ్రామానికి చెంది న రామచంద్రయ్య అనే రైతు వివరించారు. వచ్చిన తప్పులను సరిచేయాలని ఫరూఖ్‌నగర్ తహశీల్దార్ కార్యాలయానికి ఎన్నిమార్లు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. సర్వేనంబర్, ఆధార్‌కార్డు నంబర్, పాత పాస్‌పుస్తకం పట్టా నంబర్‌తో సహా అన్ని వివరాలను స్థానిక వీఆర్‌ఓకు ఇచ్చామని, కానీ నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో మళ్లీ అవే తప్పులు వచ్చాయని వివరించారు. ధరణి వైబ్‌సైట్ రావడం లేదని, వచ్చిన తరువాతే నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో వచ్చిన తప్పులను సరిచేయనున్నట్లు అధికారులు తెలుపుతున్నారని రైతు వివరించారు.

తప్పులను సరిచేస్తాం: తహశీల్దార్
ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధరణి వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తేనే నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పులను సరిచేస్తామని, అప్పటివరకు రైతులు వేచి ఉండాల్సిందేనని ఫరూఖ్‌నగర్ తహశీల్దార్ రామారావు వివరించారు. రైతులు ఫిర్యాదులు చేశారని, వైబ్‌సైట్ వచ్చిన వెంటనే తప్పులను సరిచేసే పనిలో నిమగ్నం కానున్నట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోనే వైబ్‌సైట్ ప్రారంభం కానున్నట్లు వివరించారు.