హైదరాబాద్

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి అన్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ‘జయహో తెలంగాణ’ పేరిట నిర్వహించిన మల్లీ టాలెంటెడ్ కార్యక్రమం ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామచంద్రరెడ్డి మాట్లాడుతూ.. భారత్ ఆర్ట్స్ అకాడమీ వివిధ రాష్ట్రాలలో నిర్వహిస్తున్న సాంస్కృతిక సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడు తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు తెలియజేస్తూ.. బాల యువ కళాకారులను ప్రొత్సహిస్తుందని తెలిపారు. కళాకారులలో దాగివున్న ప్రతిభను సృతనాత్మకతను వెలికితీయడం అభినందనీయమని అన్నారు. అనంతరం బాల నటిగా భక్త ప్రహ్లాద సినిమాలో నటించిన నటి రోజారమణికి భారత్ అకాడమీ జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆచార్య చెన్నప్ప, అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలితారావు, లయన్ డా.రమణరావు పాల్గొన్నారు.