హైదరాబాద్

కూల్చివేతలు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏదైనా కాలవైపరీత్యం.. ప్రకృతి విపత్తుల సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతే గానీ స్పందించని బల్దియా అధికారులు ఈ వర్షాకాలం శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాలపై కాస్త ముందుగా కళ్లు తెరిచారు. ఈసారి వర్షాలు మరింత దంచికొట్టే అవకాశాలున్నాయన్న సూచనల మేరకు నగరంలో ప్రజల పాలిట ప్రాణాంతకంగా, ప్రమాదకరంగా మారిన శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాల తొలగింపుకు జీహెచ్‌ఎంసీ చర్యలను ముమ్మరం చేసింది. నగరంలోని మొత్తం 30 సర్కిళ్లలో ఇప్పటికే సుమారు 1194 ఈ పాతకాలపు భవనాలను గుర్తించి, వీటిలో ఇదివరకే 413 భవనాలను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు మరో 175 భవనాలకు మరమ్మతులు, పటిష్టపు చర్యలను చేపట్టగా, మిగిలిన 743 భవనాలు ప్రమాదకరంగా మారటంతో, వీటిలో కాస్త ధృడంగా కన్పించే భవనాలకు మరమ్మతులు, పటిష్టపు చర్యలు చేపట్టడం, లేదంటే నేలమట్టం చేయటం వంటి పనులు చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు పాతకాలపు భవనాలపై జీహెచ్‌ఎంసీ ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ భవనాల తొలగింపునకు ప్రత్యేకంగా ప్రణాళికలను సిద్దం చేసింది. కొద్దిరోజులుగా అడపాదడపగా చేపట్టిన ఈ కూల్చివేతలను సోమవారం ముమ్మరం చేసింది. ఒకే రోజు 47 భవనాలను కూల్చివేసింది. సోమవారం ఎల్‌బీనగర్ సర్కిల్‌లో మూడు, చార్మినార్ జోన్‌లో మూడు, ఖైరతాబాద్ జోన్‌లో 12, సికిందరాబాద్‌లో ఎనిమిది, శేరిలింగంపల్లిలో ఆరు, కూకట్‌పల్లి జోన్‌లో 15 భవనాలను కూల్చివేసినట్లు అధికారులు తెలిపిరు. వర్షాకాలం విపత్తుల నివారణలో భాగంగా ఈ శిథిల భవనాలను తొలగించటం, లేక పటిష్టపు చర్యలు చేపట్టాలా అనే విషయంపై ఇంజనీరింగ్ విభాగాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా మారిన భవనాలను మాత్రమే కూల్చివేస్తున్నట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు పేర్కొన్నారు. ఈ భవనాల్లో తమ పూర్వీకుల స్మృతులు, గుర్తులున్నాయంటూ ఇంకా అందులోనే గడుపుతున్న వారిని ఖాళీ చేయాలని సూచించినా, అందుకు నిరాకరించటంతో వారికి జీహెచ్‌ఎంసీ అధికారులు కౌనె్సలింగ్ నిర్వహించి, ఒప్పిస్తున్నారు. ప్రమాదకరంగా గుర్తించిన, ఇంజనీరింగ్ విభాగం నిర్దారణ చేసిన భవనాల పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా ముందు జాగ్రత్త చర్యగా వాటి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.