హైదరాబాద్

శ్రీవారి పరువు విలువ రూ.100కోట్లా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, జూన్ 20 : శ్రీవారి పరు వు విలువ కేవలం రూ. 100కోట్లకే పరిమితం చేస్తున్నారా అని తిరుమల తిరుపతి దేవస్ధానం మాజి ప్రధాన అ ర్చకులు రమణ దీక్షితులు ప్రభుత్వాని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పరువు నష్టం దావా నోటీస్ పై ఆగ్రహాన్ని వ్యక్తాం చేశారు. గురువా రం సోమాజిగూడ ప్రస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ టీటీడీలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తే తనపై పరువు నష్టం దావా వేసారని తెలిపారు. నాడు టీటీడీకి జేఈవోగా ఉన్న శ్రీనివాసరాజు.. స్వామివారి పాత అభరణాల ను మరమ్మతులు చేస్తామని చెప్పి కొన్నింటిని మాయం చేశారని ఆరోపించారు. తన వాదనను రాజకీయం చేస్తూ దానికి వక్ర భాష్యాలు చెబుతున్నారని, అడిగిన దానికి ఏపీ ప్రభు త్వం సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. నాడు శ్రీకృష్ణ దేవరాయలు స్వా మి వారికి కనకాభిషేకం చేసిన రూ. 18లక్షల బంగారు పరహాలు పోటు నేలమలిగలో ఉన్నాయని చెప్పారు. తిరుమల ఆలయంలోని శాసనాలలో ఉందని గుర్తుచేశారు. తనకు పరువు నష్టం దావా ఇచ్చే బదులు ఏపీ ప్రభు త్వం నగల మాయంపై విచారణ కమి టీ వేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డా రు. టీటీడీలో జరుగుతున్న అక్రమాల పై ప్రభుత్వం స్పందించక పోవడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వివరించినట్లు తెలిపారు.

దేవమ్మ బస్తీ సమస్యల పరిష్కారానికి కృషి
* ఎమ్మెల్యే కేపీ వివేక్
జీడిమెట్ల, జూన్ 20: దేవమ్మ బస్తీలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ దేవమ్మబస్తీ సంక్షేమ సంఘం సభ్యులు కుత్బుల్లాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే కేపీ వివేక్‌ను కలిసి సమస్యల పై వినతి పత్రాన్ని అందజేశారు. దేవమ్మబస్తీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ దేవమ్మబస్తీలో మంచినీటి పైపులైన్‌లు కొనే్నళ్ల క్రితం వేసిందని, నూతన పైపులైన్‌లను వేసి నీటి సమస్యను తీర్చాలని కోరారు. కాలనీలో ఎమ్మెల్యే పాదయాత్ర
గండిమైసమ్మ దుందిగల్ మండల పరిధిలోని కొంపల్లి గ్రామం ఉమామహేశ్వర కాలనీలో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్ సమస్యల పై పాదయాత్ర చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. వివేక్ మాట్లాడుతూ ఉమామహేశ్వర కాలనీ వాసులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని అన్నారు. ఎంపీపీ కవిత, ఉపసర్పంచ్ సన్న రవి, నాయకులు వేణు పాల్గొన్నారు.