హైదరాబాద్

ప్రైవేట్ స్కూళ్ల ఫీ‘జులుం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: పాఠశాల, కాలేజీ ఏదైతేనేం చదువుకోవాలంటే భరించని స్థాయిలో ఫీజులు చెల్లించాల్సిందే. అధిక మొత్తంలో ఫీజులు, విరాళాలు, క్యాపిటేషన్ ఫీజులు, టర్మ్ ఫీజులు వంటివి స్వీకరించరాదంటూ ప్రత్యేకంగా ఫీజుల నియంత్రణ చట్టం ఉన్నా, అది కనీస అమలుకు నోచుకోవటం లేదు. అడ్డుకునే వారు, పట్టించుకుని ప్రశ్నించే వారు లేకపోవటంతో రోజురోజుకీ ప్రైవేట్ విద్యా సంస్థల అధిక ఫీ‘జులుం’కు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పిల్లలకు చక్కటి భవిష్యత్తును ఇవ్వాలనుకునే తల్లిదండ్రులు, ఉన్న చదువులు చదవాలనుకునే పేద, మధ్య తరగతికి చెందిన పేద విద్యార్థుల కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. క్యాపిటేషన్ ఫీజులు, డొనేషన్ వంటి ఫీజుల నియంత్రణకు ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయటంతో అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన చట్టం అటకెక్కింది. అప్పట్లో తల్లిదండ్రుల్లో భగ్గుమన్న ఫీజుల వ్యతిరేక ఆందోళన మరోసారి పునరావృత్తమయ్యేలా ఉంది. ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల అనుమతికి సంబంధించి విద్యా శాఖ నిబంధనలను సైతం తుంగలో తొక్కి అందినంత దండుకుని విచ్చలవిడిగా అనుమతులు జారీ చేసిన సర్కారుకు ఈ పరిణామం ఓ చిన్న విషయమే అయినా, ఎన్నో జీవితాలు రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ మాట దేవుడెరుగు, కనీసం పార్కింగ్ వసతి కూడా లేని ప్రయివేటు పాఠశాలలు గ్రేటర్ నగరంలో యథేచ్చగా కొనసాగుతున్నాయంటే విద్యా శాఖను ప్రైవేట్ స్కూల్ యజమానులు ఏ మేరకు ప్రభావితం చేశాయో అంచనా వేసుకోవచ్చు. కళ్ల ముందే నిబంధనలకు విరుద్దంగా పాఠశాలు, కాలేజీలు కొనసాగుతునే చర్యలు లేకపోవటం గమనార్హం.
నగరంలోని పలు ప్రముఖ ప్రాంతాల్లో కొనసాగుతున్న పలు ప్రైవేట్ పాఠశాలల నిర్వహణలో మన పాలకుల్లోని కొందరు, ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖకు చెందిన కొందరు అధికారులు భాగస్వాములుగా కొనసాగుతున్నారు. చట్టసభలో పేదలు, మెరుగైన విద్య అంటూ ప్రగల్బాలు పలుకుతూనే పరోక్షంగా ప్రైవేట ఫీజుల దందాను ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. కేజీలో పిల్లలను చేర్చేందుకు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు లక్షల్లో విరాళాలను బహాటంగానే డిమాండ్ చేస్తున్నాయి. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నాయని భావిస్తున్న పలు ప్రైవేట్ పాఠశాలలు టర్మ్ ఫీజులు, డొనేషన్లతో తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. స్వరాష్ట్రం, స్వపరిపాలనలో సర్కార్.. ఫీజుల నియంత్రణపై స్పష్టమైన ఆదేశాలేమీ జారీ చేయకపోవటంతో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్ధల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.
ఇష్టారాజ్యంగా అనుమతుల జారీ
నగరంలో ప్రైవేటు పాఠశాలలు నడిపేందుకు విద్యాశాఖ ఇష్టారాజ్యంగా అనుమతులు జారీ చేయటమే అధిక ఫీజుల వేధింపులకు కారణమనే వాదనలున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో నాలుగైదు గదుల్లో, కమ్యూనిటీ హాళ్లలో కూడా ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి ఉందంటే మరీ ఆశ్చర్యం. నిబంధనల ప్రకారం తరగతికి కనీసం రెండు గదులు, కాలేజీలకైతే విశాలమైన క్రీడామైదానం, ల్యాబ్‌లతో పాటు సొంత భవనం, అందులో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు, నిపుణులైన ఫ్యాకల్టీ, నిర్వాహకుడు విద్యావంతుడై ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ, రెండు మూడు గదుల్లో, పదో తరగతి వరకు చదువుకున్న ఇద్దరు ముగ్గురు టీచర్లు, విద్యావంతుల మాట దేవుడెరుగు శివార్లలో కొందరు రాజకీయనాయకులు, రౌడీలు కూడా ప్రైవేట్ స్కూళ్లు నిర్వహిస్తున్నారంటే ప్రైవేట్ పాఠశాలల అనుమతులు, క్షేత్ర స్థాయి తనిఖీల పట్ల విద్యాశాఖ అనుసరిస్తున్న నిర్లక్ష్యపు తీరును అంచనా వేసుకోవచ్చు.