హైదరాబాద్

ఆన్‌లైన్‌లో ఆరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: జీహెచ్‌ఎంసీ ఆదాయ వనరుల్లో ఒకటైన అడ్వర్‌టైజ్‌మెంట్ విభాగం మొత్తం కూడా ఇకపై ఆన్‌లైన్‌లో పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా నగరంలోని హోర్డింగ్‌లు, వాటి అనుమతులు, వాటి గడువు ఎపుడు పూర్తవుతుంది? సంబంధించి ఫీజులు చెల్లించారా? చెల్లించని పక్షంలో ఆన్‌లైన్‌లో చెల్లింపులు వంటి అంశాలన్నింటికీ సంబంధించి ప్రత్యేకంగా ఓ యాప్‌ను జీహెచ్‌ఎంసీ అందుబాటులోకి తేనుంది. ఈ ప్రక్రియను వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అడ్వర్‌టైజ్‌మెంట్ విభాగంలో ఐటీ ఆధారిత సేవలను ప్రవేశపెట్టడం వల్ల ఫైల్, హోర్డింగ్‌ల వివరాలు డిజటలైజేషన్ చేసినట్లు తెలిపారు. విభాగం నిర్వహణ తీరును మెరుగుపరిచి, ఇప్పటి వరకున్న పలు రకాల ఆరోపణలను, నిర్వాహణ పరమైన లోపాలను అధిగమించేందుకు అధికారులు ఈ ఐటీని ప్రవేశపెట్టనున్నారు. సకాలంలో హోర్డింగ్, యూనిపోల్స్‌ల లైసెన్సులను రెన్యువల్ చేయటం మొదలుకుని, హోర్డింగ్ నిర్వాహణలోని లోపాలను కూడా గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకునే తరహాలో ఈ వెబ్‌సైట్ పనిచేయనుంది. ప్రస్తుతం మ్యానువల్‌గా నిర్వహిస్తున్న ఈ విభాగంలోని నిర్వాహణను ప్రత్యేక వెబ్‌తో ఏ హోర్డింగ్ ఎక్కడుంది, ఏ జోన్, ఏ సర్కిల్ పరిధిలోకి వస్తుంది, లైసెన్సు గడువు ఎపుడు ముగియనుంది, అందుకు సంబంధించి ఫీజు ఎంత, చెల్లించారా, హోర్డింగ్ జియోగ్రాఫికల్ లోకేషన్‌లో ఉంది, హోర్డింగ్ నిర్వాహణ ఎలా ఉందనే అంశాలన్నీ ఒక్క క్లిక్‌తోనే తెలుసుకోనున్నారు. ఒక్కో హోర్డింగ్, యునిపోల్స్‌కు సంబంధించిన లైసెన్సుల గడువుకు ముందే అధికారులను అప్రమత్తం చేసి, అందుకు సంబంధించి హోర్డింగ్, యునిపోల్స్ ఏజెన్సీలకు నోటీసులు పంపే విధంగా ఈ యాప్ పనిచేయనుంది. క్షేత్ర స్థాయిలో ఏ ఇంజనీరైనా, అధికారైన హోర్డింగ్‌కు సంబంధించి తప్పుడు సమాచారమిస్తే యాప్‌తో వెంటనే తెలుసుకునే అవకాశముంది. మేయర్, కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికపుడు పరిస్థితులను కనుగునే అవకాశం ఏర్పడనుంది. ఫీజులను డిజిటల్ రూపంలో చెల్లించే అవకాశం ఉంది. అడ్వర్‌టైజ్‌మెంట్ విభాగంలో ఛార్జీల స్వీకరణ పారదర్శకంగా, జవాబుదారీతనంగా మరింత పెరిగేందుకు వీలు ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.