హైదరాబాద్

శివార్లలో మూడు ఫారెస్టు బ్లాక్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిపాలన వ్యవహారాల్లోనూ కీలకమైన పాత్ర పోషించే స్థారుూ సంఘం మూడో కమిటీ మొదటిసారిగా గురువారం సమావేశమైంది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు ముఖ్యమైన తీర్మానాలను చేసింది. కొత్తగా ఎన్నికైన ఏ.కృష్ణ, గొల్లూరు అంజయ్య, ఎస్. జగదీశ్వర్‌గౌడ్, తుము శ్రవణ్‌కుమార్, ముద్దగోని లక్ష్మీప్రసన్న, ఎస్. శేషుకుమారి, ఎ.సరస్వతీ, సింగిరెడ్డి స్వర్ణలత, అబ్దుల్ వాహెబ్, నస్రీన్ సుల్తానా, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ మోబిన్, మహ్మద్ ముర్తుజా అలీ, మహ్మద్ రషీద్ సిరాజుద్దిన్, శ్రీనివాస్ రెడ్డికి ఉన్నతాధికారులు మొక్కలను అందజేసి స్వాగతించారు.
సమావేశంలో జీహెచ్‌ఎంసీని 50 సర్కిళ్లుగా విభజించాలనే ప్రతిపాదన, గ్రేటర్‌లోని శివార్లలలో మూడు ఫారెస్టు బ్లాకులు ఏర్పాటు చేయాలని వచ్చిన ప్రతిపాదనలకు స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది. దీంతో పాటు బల్దియా పునవ్యవస్థీకరణ, మలక్‌పేటలో ఆర్‌యుబీ విస్తరణ, పంజాగుట్టలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
‘స్థారుూ’ తీర్మానాలు
* జీహెచ్‌ఎంసీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రతిపాదిత 50 సర్కిళ్లు, పది జోన్లకు సంబంధించి సిబ్బంది, అధికారుల నియామకం విధానలా, 1200 అదనపు పోస్టులు, అదనపు పోస్టులకు సంబంధించి ఏటా అయ్యే రూ.98 కోట్ల అదనపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
* నగరంలో వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు, ప్రజలకు మరింత మెరుగైన జీవన ప్రమాణాలను అందించేందుకు శివార్లలో మూడు ఫారెస్టు బ్లాక్‌లను ఏలర్పటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మేడ్చల్ జిల్లాలో బోరంపేట, రామారం, సూరారం ఫారెస్టు క్లస్టర్లలో 455.54 హెక్టార్లలో రూ.12.18 కోట్ల వ్యయంతో ఫ్లారెస్టు బ్లాకు ఏర్పాటు, రంగారెడ్డి జిల్లాలోని నాదర్‌గుల్‌లో 42.90 హెక్టార్లలో రూ. 2.02 కోట్ల వ్యయంతో మరొకటి, మాదన్నగూడ క్లస్టర్‌లో 97.12 హెక్టార్లలో రూ.3.55 కోట్ల వ్యయంతో ప్రతిపాదిత ఫారెస్టు బ్లాక్‌లను ఏర్పాటు చేసేందుకు స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది.
* పంజాగుట్ట చట్నీస్ వద్ద రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్న శ్మశానవాటికపై రూ. 5.97 కోట్ల వ్యయంతో స్టీల్ బ్రిడ్జిని నిర్మించేందుకు స్థారుూ సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
* ప్రతి జోన్‌లో 50 లగ్జరీ వాష్‌రూంల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ చేపట్టే అంశానికి గ్రీన్ సిగ్నల్
* చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్టులో భాగంగా లాడ్ బజార్‌లోని మహబూబ్ చౌక్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ రెండు అంతస్తులుగా నిర్మించేందుకు రూ.36 కోట్ల విలువైన ప్రతిపాదనకు కూడా స్థారుూ మోక్షం కల్గించింది.
ముర్గీ చౌక్ పునర్ నిర్మాణంలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది.
* పత్తర్‌గట్టి నుంచి చార్మినార్ మార్గంలో ఉన్న పత్తర్‌గట్టి ఆర్కేడ్ పునరుద్దరణకు మిగిలిన పనులను రూ. 5.97 కోట్ల వ్యయంతో చేపట్టే ప్రతిపాదనకు అనుకూలంగా తీర్మానం.
* ఎర్రమంజిల్ ప్రనవ్ లాడ్జి నుంచి హెరిటేజ్ ఫ్రెష్ వ రకు 40 అడుగుల విస్తరణ సందర్భంగా 15 ఆస్తుల నుంచి స్థలాన్ని సేకరించే విధంగా అనుకూలమైన నిర్ణయం.
* ప్రభుత్వ ఉద్యోగులకు 24.104 శాతం నుంచి 25.676 శాతానికి కరువు భత్యం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసినందుకు అది జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు వర్తింపజేసేందుకు ఆమోదం.
* గ్రేటర్ హైదరాబాద్‌లో చెరువుల పునర్ నిర్మాణం, అభివృద్ధిని పెద్ద ఎత్తున చేపడుతున్న దృష్ట్యా ఏర్పడే న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొవటానికి లేక్స్ విభాగానికి ప్రత్యేకంగా స్టాండింగ్ కౌన్సిల్‌ను నియమించే ప్రతిపాదనకు కూడా ఆమోదం.
* 2018 స్థారుూ సంఘం సమావేశాలను ప్రతి గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించాలని నిర్ణయం.
* మలక్‌పేట రైల్వేస్టేషన్ వద్ద తీవ్రంగా ఉండే ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొనేందుకు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద అదనపు మార్గం ఏర్పాటు చేసేందుకు అడ్డుగా ఉన్న ఏడు ఆస్తుల నుంచి స్థలాన్ని సేకరించాలని నిర్ణయం.