హైదరాబాద్

క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) ఆధ్వర్యంలో వివిధ స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ జిల్లా యువజన సర్వీసులు, క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు అధికారి సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చునని తెలిపారు. జిల్లా స్థాయిలో బాలబాలికలకు వేరువేరుగా వివిధ అంశాల్లో పోటీలు జరుగుతాయి. ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్న బాలబాలికలు 1-9-2009 నుంచి 31-8-2018లోపు జన్మించిన ఉండాలి. రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు ఈనెల 28, 29 తేదీల్లో హకీంపేట్‌లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలో జరుగుతాయి. విద్యార్థులు వయసు ధ్రువీకరణ పత్రంతో పాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జారీ చేసిన బోనఫైడ్, ఆధార్‌కార్డుతో పాటు కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జత చేయాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో ఈనెల 25, 26 తేపదీల్లో సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఉదయం ఎనిమిది గంటలకు జిల్లా యువజన సర్వీసులు, క్రీడాధికారి సుధాకర్‌ను కలిసి పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు ఆబిడ్స్‌లోని కలెక్టరేట్‌లోని జిల్లా యువజన సర్వీసులు, క్రీడా అధికారి కార్యాలయం (్ఫన్ నెంబర్ 040-23205577) లేదంటే జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయం, జింఖానామైదానం, సికింద్రాబాద్ (్ఫన్ నెంబర్ 040-27900649)లో సంప్రదించాల్సి ఉంటుంది.