హైదరాబాద్

పూర్వీకులు అందించిన వరం ‘యోగ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : సంపూర్ణ ఆరోగ్యానికి పూర్వీకులు అందించిన గొప్ప వరం యోగా అని కేంద్ర జాతీయ రహదారులు, నౌకయాన మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి మాండవీయ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మాండవీయ మాట్లాడుతూ యోగాసనాలతో దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి త్వరితగతిన నయమవుతుందని అన్నారు. యోగాతో ఎటువంటి దుష్ప్రాభావాలు ఉండవని, మెరుగైన ఆరోగ్యంతో పాటు అందరిలోను మనమనే విశాల భావం కలుగుతనంది వివరించారు.
ప్రత్యేక అతిథులుగా హాజరైన ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, జిల్లా మంత్రి పట్నం మహేందర్ రెడ్డిలు మాట్లాడుతూ యోగా చేయడం సులువైన పని అని, ముస్లింలు రోజు చేసే నమాజ్‌లో యోగాసనాలు ఉంటాయని తెలిపారు. క్రమం తప్పకుండ కార్యక్రమాలు చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆరోగ్య తెలంగాణ సాధించడానికి ప్రభుత్వం ఆయుష్ శాఖకు నిధులు కేటాయించి ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ద, హోమియో తదితర ప్రాచీన వైద్య చికిత్సలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్. వేణుగోపాలచారి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, వైద్య సేవల వౌలిక సదుపాయల అభివృద్ధి సంస్థ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధి, కార్పొరేటర్ సాయిబాబా పాల్గొన్నారు.