హైదరాబాద్

దొరకని ఆచూకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్: కాలిఫోర్నియాలోని మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఎనిమిది నెలలుగా ఆచూకీ లేకుండా పోయాడు. సెల్‌ఫోన్, సోషల్ మీడియాలో కూడా అందుబాటలోకి రాకపోవడంతో సైదాబాద్‌లో నివసించే తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అమెరికాలో కొడుకు అదృశ్యమైన ఘటన గూర్చి సైదాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేసారు.
వివరాలు ఈవిధంగా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అమలపురానికి చెందిన పండు బంగారం సైదాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో ఈఈగా పనిచేసి రిటైర్ అయ్యారు. అతని కుమారుడు రాఘవేంద్ర 2007లో జేన్‌టీయూలో బీటెక్, 2010లో లండన్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. 2011లో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో కాలిఫోర్నియాకు వెళ్లాడు. తరచూ తల్లిదండ్రులతో సెల్‌ఫోన్‌లో సంభాషించేవాడు.
2017 అక్టోబర్ 21న తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన రాఘవేందర్ త్వరలో ఇండియా వస్తానని చెప్పాడు. ఆ రోజు తరువాత నుంచి అతని సెల్‌ఫోన్ పనిచేయటం లేదు. సోషల్ మీడియాలో కూడా స్పందించటం లేదని తండ్రి వాపోయాడు. ఈనెల 11న సైదాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేసారు. సైదాబాద్ పోలీసులు కేసును సిటీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు బదిలీ చేశారు. కుమారుడి ఆచూకీ కనిపెట్టామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు రాఘవేందర్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.