హైదరాబాద్

బేఖాతర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో ఒక్కసారి పోస్టింగ్ దక్కించుకుని విధులు నిర్వహించే అధికారులు సీట్లను వదిలి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. రాజకీయ, ఆర్థిక పలుకుబడితో జీహెచ్‌ఎంసీలో అసాధ్యమంటూ ఏమీ లేదు. జీహెచ్‌ఎంసీలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో అయిదేళ్లకు మించి, ఏళ్ల తరబడి పనులు చేస్తున్న టౌన్‌ప్లానింగ్ అధికారులను బదిలీ చేస్తూ, కొందరికి పదోన్నతులను కల్పిస్తూ స్థానచలనం కల్గిస్తూ జారీ అయిన ఆదేశాలను పలువురు అధికారులు బేఖాతరు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఇదే తరహాలో పలువురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషనర్ జనార్దన్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలను సైతం లెక్క చేయకుండా, ఆదేశాలను బేఖాతరు చేస్తూ తాను పనిచేస్తున్న సర్కిల్‌లోనే కొనసాగేందుకు ఓ మహిళా డిప్యూటీ కమిషనర్ ప్రయత్నాలు చేసుకోవటం, కమిషనర్ నియమించిన డిప్యూటీ కమిషనర్‌కు మరో చోట పోస్టింగ్‌ను ఇప్పించటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయ. ఇపుడు ఇదే తంతు టౌన్‌ప్లానింగ్‌లో కూడా మొదలైంది. తాజాగా టౌన్‌ప్లానింగ్ అధికారులు తమ మాతృశాఖ ఆదేశాలనే బేఖాతరు చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీ ఆదేశాలు వెలువడగానే వాటిని గౌరవిస్తూ, కొందరు అధికారులు ఉన్నతాధికారులు కేటాయించిన ప్రాంతంలో విధులు నిర్వర్తించేందుకు వెళ్లగా, బదిలీ అయిన వారిలో మెజార్టీ సంఖ్యలోని అధికారులు అదే కుర్చీలో కొనసాగేందుకు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. టౌన్‌ప్లానింగ్ విధులు నిర్వహిస్తున్న డీటీసీపీకి చెందిన అసిస్టెంటు సిటీ ప్లానర్లు ఎన్. చారి, ప్రేమ్‌కుమార్, నర్సింహరాములు, శేరిలింగంపల్లి అసిస్టెంటు సిటీ ప్లానర్ శ్రీనివాసరావులకు స్థాన చలనం కల్గిస్తూ ఇటీవలే డీటీసీపీ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో చారి, ప్రేమ్‌కుమార్, నర్సింహరాములకు ఉన్నతాధికారులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. వీరిలో చారి ఒక్కరు మాత్రమే రెండురోజుల క్రితం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రిపోర్టు చేసినట్లు తెలిసింది మిగిలిన ఏసీపీలు నర్సింహరాములు, ప్రేమ్‌కుమార్, శ్రీనివాస్‌రావులు ఇంకా సీట్లను వదలలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు ఎప్పటికపుడు నీరు గారిపోవటం, నచ్చిన చోటే పనిచేసేందుకు రాజకీయంగా వత్తిళ్లు చేసే అధికారులకు ప్రజలకు ఎలా పారదర్శకంగా సేవ చేస్తారోనన్న చర్చ సైతం లేకపోలేదు.