హైదరాబాద్

విజయవంతంగా ఒలింపిక్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, ఒలింపిక్ సంఘం తెలంగాణ (ఓఏటీ)ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఒలింపిక్ డే రన్’ విజయవంతంగా జరిగింది. వందలాది మంది క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడా సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో పాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రన్‌లో పాల్గొని క్రీడా స్పూర్తిని చాటారు. పాతబస్తీ చార్మినార్, ఛాదర్‌ఘాట్, గ్రేటర్ హైదరాబాద్ వైఏంసీఏ నారాయణగూడ, యూసుఫ్‌గూడా స్టేడియం, మెహిదిపట్నం, బోయిన్‌పల్లి జింఖానా సెంటర్, గాంథీ విగ్రహాం సికింద్రాబాద్‌ల నుండి శుక్రవారం ఉదయం ఆరు గంటల తర్వాత ప్రారంభమైన రన్ వివిధ ప్రాంతాల మీదుగా ఎల్భీ ఇండోర్ స్టేడియంకు చేరుకుంది. రన్ కోనసాగే ప్రాంతాల్లో రన్‌లో పాల్గొన్న క్రీడాకారులు, ఇతరులకు ఏలాంటి ఆసౌకార్యం కలుగాకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. ఒలింపిక్ రన్ సందర్భంగా నగరంలోని రోడ్లన్ని క్రీడాకారులతో సందడిగా మారాయి. దాదాపు మూడు వేల మంది క్రీడాకారులు ఒలింపిక్ రన్‌లో పాల్గొని స్పూర్తిని చాటారు.
క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
* చీఫ్ సెక్రటరి బుర్రవేంకటేశం
తెలంగాణ క్రీడాకారులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తునే వుందని తెలంగాణ రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం అన్నారు. నరంలో శనివారం నిర్వహించిన ఒలింపిక్ రన్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. నగరంలోని ఏడు ప్రాంతాల నుంచి క్రీడా జ్యోతితో రన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన అభినంధించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీర దారుడ్యానికి దోహతపడుతయన్నారు. క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని, ప్రస్తుతం గ్రామల నుండి ఎంతో మంది క్రీడాకారులు వివిధ క్రీడల్లో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారని వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్రీడలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి క్రీడాకారులను అన్ని విధాల ప్రోత్సహిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వివిధ క్రీడల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు సుమారు రూ.10లక్షల నుండి 50లక్షల వరకు పారితోషికాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు శాతం రిజర్వేషన్‌ను క్రీడాకారులకు కల్పించిన సీఏంకు కృత్ఞతలు తెలిపారు. త్వరలో ఎక్సైజ్ శాఖ నుండి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం రావాల్సిన నిధులకు సంబంధించిన ఫైల్‌కు సీఎం అంగికరిస్తే దాదాపు రూ.110 కోట్ల వరకు నిధులు సమాకురే ఆవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర క్రీడాకారులు అన్ని క్రీడాంశాల్లో దఃసుకేళుతున్నారని, తెంలగాణ రాష్ట్రాన్ని ‘స్పోర్టీవ్ స్టేట్’గా మార్చాలని క్రీడాకారులకు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఒలింపిక్ డే సందర్భంగా పిలుపునిచ్చారు. భారత ఒలింపిక్ సంఘం, ఒలింపిక్ సంఘం తెలంగాణ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణల సంయుక్త ఆధ్వర్యంలో ఒలింపిక్ రన్ జరిగింది. రన్ విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డు, పోలీసు, విధ్యా శాఖ అధికారులతో పాటు ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, కోచ్‌లను ఒలింపిక్ సంఘం తెలంగాణ ప్రధాన కార్యధర్శి ఎస్‌ఆర్.ప్రేమ్‌రాజ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పాపారావు, సాట్స్ వీసీ, ఎండీ ఏ.దినకర్ బాబు, ఓఏటీ అధ్యకుడు కే.రంగారావు, నంది టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా భరత్ కుమార్‌రెడ్డితో పాటు తెలంగాణ స్కూల్ గేమ్స్ సమాఖ్య నిర్వహణ కార్యదర్శి కుంభం రామ్‌రెడ్డితో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉత్సహం చూపిన విద్యార్థులు
* ఎస్‌జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామ్‌రెడ్డి
హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఒలింపిక్ డే పరుగులో విద్యార్థులు ఎంతో అసక్తితో రన్‌లో పాల్గొన్నారని తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య (టీఎస్‌జీఎఫ్) నిర్వహణ కార్యదర్శి డాక్టర్ కుంభం రామ్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఒలింపిక్ డే రన్‌కు ఎంతో ప్రధాన్యతను సంతరించుకుంది, ఈ విషయంలో విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఏకగ్రత, పోటీతత్వం అలవడుతుందన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు వారి తల్లిదండ్రులు అన్ని విధాల ప్రోత్సహించాలని సూచించారు. రన్‌లో పాల్గొన్న విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారని తెలిపారు.