హైదరాబాద్

జలమండలి వంద రోజుల యాక్షన్ ప్లాన్‌పై కేటిఆర్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి అధ్వర్యంలో చేపడుతున్న వందరోజుల యాక్షన్ ప్లాన్‌పై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. శుక్రవారం మంత్రి మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మెయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్‌తోపాటు రాష్ట్ర మున్సిపల్ వ్యవహరాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజి గోపాల్‌తో కలిసి సమీక్షలో పాల్గొన్నారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో జలమండలి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో వంద రోజుల యాక్షన్ ప్లాన్‌ను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం వెయ్యి ఇంకుడు గుంతలను నిర్మించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదువేలు నీటి కనెక్షన్‌లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. శేరిలింగంపల్లిలో మంచినీటి పైప్‌లైన్ పనులు పూర్తిచేసి దాదాపు 20వేల మందికి నీటి సౌకర్య కల్పించాలని సూచించారు. వేసవి కాలం సందర్భంగా గ్రేటర్ ప్రజలు ఎలాంటి నీటి సమస్యలను అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, రెండు నెలల పాటు ఎవరూ సెలవుల్లో వెళ్లవద్దని అధికారులకు సూచించారు. 2015-16 సంవత్సరానికి జలమండలికి బిల్లుల రూపంలో రూ.1238కోట్ల రూపాయలు ఆదాయం సమకూరిందని, గత సంవత్సరం కంటే రూ.25కోట్లు అధికమని అధికారులు వివరించారు. ముసీ సుందరీకరణ, పునర్జీవంపై నాలుగు ఎజెన్సీలు పవర్‌ప్రజేంటేషన్ ఇచ్చారు. సమావేశంలో జలమండలి ఎండి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, ఓఆండ్‌ఎం విభాగం డైరెక్టర్ జి.మేశ్వరరావు, పిఅండ్‌ఎ విభాగం సిజిఎం ప్రవీణ్‌కుమార్, జిఎం మహ్మద్‌అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు.