హైదరాబాద్

అంగన్‌వాడీల్లో కనిపించని ‘ఒక్కపూట భోజనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, జూలై 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక్కపూట భోజన పథకాన్ని ప్రవేశపెడితే అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారైంది. అంగన్‌వాడీ కేంద్రాలకు గర్భిణులు, బాలింతలను తీసుకువచ్చి పౌష్ఠిక ఆహారంతో కూడిన ఒక్కపూట భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బాలమృతం పథకం ద్వారా ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల చిన్నారులకు 16గుడ్లతో పాటు పౌష్ఠికాహారం ఇవ్వాల్సి ఉంటుంది. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహకులు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండల పరిధిలోని కాకునూరు, లేమామిడి, బోధునంపల్లి, లింగంధన, ఇప్పలపల్లి, పాపిరెడ్డిగూడ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారో.. ఎప్పుడు మూస్తారో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు. కేశంపేట మండలంలోని 28గ్రామ పంచాయతీల్లో మొత్తం 48 అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరు మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల చిన్నారులు 1620 మంది, మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు 1250, గర్భిణులు, బాలింతలు మొత్తం 773మంది ఉన్నట్లు అంగన్‌వాడీ అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. ప్రతిరోజు చిన్నారులకు పౌష్ఠికాహారం ఇవ్వడంతోపాటు గర్భిణులకు, బాలింతలకు ఒక్కపూట భోజనం పెట్టాల్సి ఉన్నప్పటికీ చాలాచోట్ల అంగన్‌వాడీ కేంద్రంలో పెట్టడం లేదు. ఇదేమని అంగన్‌వాడీ నిర్వాహకులను ప్రశ్నిస్తే గుడ్లు రాలేదు.. వచ్చిన తరువాత ఇస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు వచ్చేది కొద్ది మంది అయితే రికార్డుల్లో మాత్రం ఎక్కువగా రాసుకొని అదనంగా వచ్చిన పౌష్ఠికాహారం, గుడ్లు, బాలమృత పథకం ద్వారా వచ్చే పాల పాకెట్లను ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గుడ్లు సక్రమంగా పంపిణీ చేయడం లేదు
* గర్భిణి మాధవి (కాకునూరు)
అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్లు, పౌష్ఠికాహారం సక్రమంగా పంపిణీ చేయడం లేదని కాకునూరు గ్రామానికి చెందిన గర్భిణి మాధవి వివరించారు. కేంద్రానికి ఎప్పుడు వెళ్లినా పేర్లు రాసుకుంటారని, ఇవ్వడం లేదని తెలిపారు. గర్భిణులు, బాలింతలకు ఒక్కపూట భోజనం పెట్టాల్సి ఉన్నప్పటికీ అంగన్‌వాడీ కేంద్రంలో అసలు వంటనే చేయడం లేదని వివరించారు. షాద్‌నగర్ నుంచి వచ్చే అధికారులు ఇలా వచ్చి అలా వెళ్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
సక్రమంగా గుడ్లు పంపిణీ చేస్తున్నాం
* కేశంపేట ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రమాదేవి
గర్భిణులకు, బాలింతలకు, కిశోర బాలికలకు గుడ్లు, పౌష్ఠికాహారం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని కేశంపేట ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎం.రమాదేవి వివరించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో ఒక్కపూట భోజన పథకాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. పౌల్ట్రి ఫాం నుంచి గుడ్లు రావడంలో కొంత ఆలస్యం కావడంతో పంపిణీ చేయడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.