హైదరాబాద్

ఉజ్జయినీ మహంకాళీకి 3.8 కిలోల బంగారు బోనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, బేగంపేట, జూలై 9: ఆషాఢ మాసం బోనాల జారతలో భాగంగా అత్యంత ఘనంగా జరిగే సికిందరాబాద్ శ్రీఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలు ఈసారి మరింత ఘనంగా జరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఉజ్జయినీ అమ్మవారికి సుమారు 3.8 కిలోల బంగారు బోనాన్ని సమర్పించనున్నారు. నగరం, శివార్ల నుంచే గాక, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు హాజరయ్యే ఈ ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు. సోమవారం సికిందరాబాద్ బోనాల ఏర్పాట్లపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస యాదవ్, పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈనెల 29, 30 తేదీల్లో జరిగే లష్కర్ బోనాల జాతరలో లక్షలాది మంది పాల్గొనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించటంతో పాటు ఈసారి బోనాల ఏర్పాట్లకు సీఎం కేసీఆర్ రూ. 15 కోట్లను మంజూరు చేసినట్లు వివరించారు. అమ్మవారి గర్భగుడికి సుమారు 250 కిలోల వెండితో వెండి తాపడం చేయించనున్నట్లు తెలిపారు. అమ్మవారికి ప్రత్యేకంగా ఖడ్గం, ముక్కుపుడకను మంత్రి శ్రీనివాస యాదవ్ సమర్పించనున్నట్లు తెలిపారు. అమ్మవారికి చేనేత కార్మికులు ప్రత్యేకంగా రూపొందించిన పట్టు వస్త్రాలను సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. బోనాల జాతర ప్రశాంతంగా, ఘనంగా జరిగేందుకు వీలుగా రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రత్యేకంగా చొరవ చూపాలని సూచించారు. జాతరకు ముందు గురు, శని, ఆదివారాల్లో వరుసగా మంచినీటి సరఫరా చేయాలని మంత్రులు జలమండలి అధికారులను ఆదేశించారు. భక్తులు ఈ జాతరను వీక్షించేందుకు వీలుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన మాదిరిగానే సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎనిమిది చోట్ల సాంస్కృతిక బృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒకవేళ వర్షం కురిసినా, విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ఈ జాతరకు మహిళలు, పిల్లలు ఎక్కువగా హజరయ్యే అవకాశమున్నందున, చీకటి పడిన తర్వాత వారికెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్‌పీ రోడ్డు, ఎంజీరోడ్డు ప్రధాన మార్గాల్లో ఎలోజెన్ లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫలహార బండ్ల నిర్వాహకులు రాత్రి ఏడు గంటలకు ఊరేగింపులు ప్రారంభిస్తే త్వరగా ముగుస్తుందని, ఆ ఊరేగింపును ప్రజలు, భక్తులు చూసే అవకాశం ఉంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. జాతరను పురస్కరించుకుని దేవాలయం పరిసర, ఇతర ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ చేపట్టిన పనుల్లో కేవలం రూ.4.5 లక్షల పనులు మాత్రమే టెండర్ దశలో ఉన్నాయని మేయర్ బొంతు రామ్మోహన్ వివరించారు. సమావేశంలో కార్పొరేటర్లు అత్తెలి అరుణ గౌడ్, ఆకుల రూప, నార్త్‌జోన్ డీసీపీ సుమతి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, డీఎంసీ శైలజ, జలమండలి డైరెక్టర్ కృష్ణ, దేవాదాయ శాఖ ఈఓ అన్నపూర్ణ, ట్రాఫిక్ అదనపు డీసీపీ అమర్‌కాంత్ రెడ్డి, సికిందరాబాద్ తహశీల్దార్ బాలశంకర్, మాజీ కార్పొరేటర్లు శీలం ప్రభాకర్ హాజరయ్యారు.

గుండెపోటుతో ఎమ్మెల్యే సంజీవ రావు సతీమణి కన్నుమూత
వికారాబాద్, జూలై 9: వికారాబాద్ శాసనసభ్యుడు బీ.సంజీవ రావు సతీమణి తార(40) గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం తెల్లవారుఝామున రెండు గంటలకు తారకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. తార మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి జీపీకే సంతాపం
గుండెపోటుతో మృతిచెందిన శాసనసభ్యుడు సంజీవ రావు సతీమణి తార భౌతికకాయాన్ని సోమవారం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సందర్శించి పూలమాలను ఉంచారు. శాసనసభ్యుడు సంజీవ రావును పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ వీ.సత్యినారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎల్.శశాంక్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి జే.రత్నారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ.సుధాకర్ రెడ్డి ఉన్నారు.
ఎమ్మెల్యే బీఎస్‌ఆర్‌ను పరామర్శించిన మంత్రి
సతీ వియోగం పొందిన వికారాబాద్ శాసనసభ్యుడు బీ.సంజీవ రావు కుటుంబాన్ని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి డాక్టర్ పీ.మహేందర్ రెడ్డి, టీఎస్‌ఎం ఐడీసీ చైర్మన్ కృష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్, చేవెళ్ల శాసనసభ్యుడు కే.యాదయ్య, శాసనమండలి సభ్యుడు పీ.నరేందర్ రెడ్డి సోమవారం సాయంత్రం పరామర్శించారు.