హైదరాబాద్

భవిష్యత్ సవాళ్లను అధిగమించేలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూలై 11: భవిష్యత్ సవాళ్లను అధిగమించేలా విస్తరణ విద్య పీజీ, పీహెచ్‌డీ సిలబస్‌లో తగిన మార్పులు ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ పీజీ స్టడీస్ డాక్టర్ కేవీఎస్ మీనాకుమారి అన్నారు. విస్తరణ విద్య పీజీ, పీహెచ్‌డీ సిలబస్ మార్పుపై డాక్టర్ కల్పనాశాస్ర్తీ అధ్యక్షతన ఏర్పాటైన బ్రాడ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏరియా(బీఎస్‌ఎంఏ) కోర్ కమిటీ రెండురోజుల సమావేశం బుధవారం విస్తరణ విద్యా కేంద్రం కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రారంభమైంది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
విద్యార్థుల నైపుణ్యాలు పెంచడం, వైఖరిలో మార్పులు వచ్చేవిధంగా పాఠ్యాంశాలలో మార్పులు జరగాలని సూచించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపకరణాలను విరివిగా వినియోగించుకొని 21వ శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా పాఠ్యాంశాలలో మార్పులు చేసుచేయాలని తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన నారమ్ మాజీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కల్పనా శాస్ర్తీ.. పీజీ, పీహెచ్‌డీ సిలబస్‌లో జరపాల్సిన మార్పులపై మాట్లాడారు. కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తోన్న డాక్టర్ లిపిదాస్.. కోర్ కమిటీ ఏర్పాటు, మార్గదర్శకాలు, క్రెడిట్, నాన్‌క్రెడిట్ కోర్సుల వివరాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. మొదటిరోజు సమావేశంలో సోషల్‌సైన్స్ విభాగానికి చెందిన పలువురు శాస్తవ్రేత్తలు పాల్గొని సూచనలు చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం విస్తరణ హెడ్ డాక్టర్ ఐ.శ్రీనివాస్ రావు, కమిటీ సభ్యులు డాక్టర్ మహపాత్ర, డాక్టర్ లోకేశ్ సింగ్, డాక్టర్ అదితి మాథుర్ పాల్గొన్నారు.

మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం
ఎమర్జెంగ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ ఏ డ్రైవ్ ఫర్ ఎకనామిక్ అపార్చునిటీస్ అనే అంశంపై గృహవిజ్ఞాన విభాగంలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ ఫ్యాకల్టీ ట్రైనింగ్‌లో మూడు వారాల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ ఉమాదేవి పాల్గొని ప్రసంగించారు. వివిధ పంటలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తులకు విలువ జోడించడంతో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. భవిష్యత్‌లో ప్యాకేజింగ్ రంగంలో విస్త్రృతమైన అవకాశాలు కలుగుతాయని అందుకు అవసరమైన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందాలని సూచించారు. హోంసైన్స్ మాజీ డీన్ డాక్టర్ మృణాళిని మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులతో పాటు మాంసం ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడంతో వాటి నిలువ సామర్థ్యాన్ని పెంచి, ఆదాయం పెరిగేలా చేయవచ్చని అన్నారు. 21 రోజుల శిక్షణ కార్యక్రమ వివరాలను ‘క్యాప్ట్’ డైరెక్టర్ డాక్టర్ ఉమామహేశ్వరి వివరించారు. దేశంలోని 10 రాష్ట్రాల నుంచి 25 మంది అధ్యాపకులు, శాస్తవ్రేత్తలు, విశ్వవిద్యాలయ గ్రంథపాలకులు డాక్టర్ వీరాంజనేయులు, అసోసియేట్ డీన్ డాక్టర్ విజయలక్ష్మీ, కోర్సు కోడైరెక్టర్ డాక్టర్ జెస్సీ సునీత, డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

పరిశోధనల ఫలితాలతో రైతులకు మేలు
జీడిమెట్ల, జూలై 11: పరిశోధనలతో వెలువడుతున్న ఫలితాలను రైతులకు చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సీ.పార్థసారధి అన్నారు. జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ సెంటర్‌లో కొండా లక్ష్మన్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం, ఉద్యాన శాఖ, తెలంగాణ ఉద్యాన పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్థసారధి విచ్చేసి మాట్లాడుతూ పరిశోధన కేంద్రంలో జరిగే పరిశోధనల ఫలితాలు రైతులకు అందించాలని అన్నారు. రీసెర్చ్ గ్యాప్ సెంటర్ విస్తరణలో శాస్తజ్ఞ్రులకు, రైతులకు మధ్య ఉన్న వ్యత్యాసం ఉందో దానిని తగ్గించడానికి, రైతులు క్షేత్ర స్థాయిలో ఉద్యాన పంటలను పండించడంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను శాస్తజ్ఞ్రులు పరిశోధనలు చేసి పరిష్కారం చూపే దిశగా ఈ సలహా మండలిలు ఉపయోగపడతాయని అన్నారు. 11 రిసెర్చ్ సెంటర్‌లలో శాస్తజ్ఞ్రులు దృష్టి సారించి పరిశోధనలు చేసి వచ్చే సంవత్సర సమావేశంలో పరిశోధనలను రైతులకు తెలియజేస్తామని వివరించారు. తెలంగాణలో ఆరు లక్షల 15 వేల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ కింద రైతులకు లబ్ధి చేకూర్చామని తెలిపారు. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును మరింత విస్తరింప జేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. కూరగాయలు, ఆకుకూరల ఉత్పత్తిలోని సమస్యలను అధిగమించి క్రాఫ్ కాలనీ సీఎం కృషి చేస్తున్నారని పేర్కొరు. ఏ ప్రాంతంలో సరైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయో దానికి అనుగుణంగా పంటలను ప్రోత్సహించి రాష్ట్రంలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ కూరగాయలు పండించాలని, ఉద్యాన శాఖ ద్వారా కొత్తరకమైన పంటలను పండించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ సెంటర్ దోహదపడుతుందని పేర్కొన్నారు. వేసవి కాలంలో కూడా కూరగాయలు పండించే అవకాశం ఉందని, రైతులకు లాభాలు చేకూర్చేలా ప్రభుత్వం పాటుపడుతుందని వివరించారు. సమావేశంలో హార్టికల్చర్ డైరెక్టర్ వెంకట రాంరెడ్డి, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ భగవాన్ పాల్గొన్నారు.