రంగారెడ్డి

పట్టణీకరణతోనే పర్యావరణనికి ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూలై 11: పట్టణీకరణతోనే పర్యావరణనికి ముప్పు వాటిల్లుతుందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్తగూడ బొటనికల్ గార్డెన్‌లోని ఐదు కోట్ల రూపాయలతో 12 ఎకరాలలో అభివృద్ది చేసిన పార్కును ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ శర వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రతి నగరం కాంక్రీట్ జంగల్‌గా మారిపోతున్నాయని చెప్పారు. గడచిన సంవత్సరాల్లో పట్టణాల అభివృద్ది ఎంత జరిగిందో రాబోవు 50 ఏళ్లల్లో అంతకంటే ఎక్కవ జరుగుతుందని అధ్యన సంస్థలు వెల్లడిస్తున్నాయని గుర్త్తుచేశారు. పట్టణీకరణలో జనాభా సంఖ్య పెరిగితే పచ్చదనం కనుమరుగు అవుతుందని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు లేకపోవడంతో కాలుష్యం వంటి సమస్యలు సమాజానికి పెను ప్రమాదంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్త చేశారు. వౌలిక వసతుల కల్పనకు 17వేల చెట్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సుప్రీం కోర్టు స్టే విధించిందని గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వాయు, జల, శబ్ద కాలుష్యాలు భయంకర సమస్యగా మారిపోయాయని విచారం వ్యక్తం చేశారు. ఇతర నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరం మెరుగుగా ఉండవచ్చని, కానీ, పరిస్థితి ఆందోళనగా ఉందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే అత్యున్నత జీవన ప్రమాణలు కలిగిన నగరాల్లో హైదరాబాద్ 142 స్థానంలోనూ, దేశ వ్యాప్తంగా చూస్తే తెలంగాణ మొదటి ర్యాంక్ కలిగి ఉందని మేర్సర్ అనే సంస్థ తన అధ్యన సర్వేలో వెల్లడించిందని చెప్పారు. ముడు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది 320 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం ఉందని తెలిపారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీలు కొండ విశే్వశ్వర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, జోనల్ కమిషనర్ హరి చందనా, టీయస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎండీ చందన్ మిశ్రాతో పాటు కార్పొరేటర్లు రాగం నాగేంద్ర యాదవ్, హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, పూజిత పాల్గొన్నారు.

పర్యావరణ సమతుల్యతకు కృషి
కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ పిలుపు
వికారాబాద్, జూలై 11: పర్యావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నాలుగో విడత హరితహారంపై సర్వమతాల పెద్దలతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటితే జిల్లా సస్యశ్యామలమై కాలుష్యం నుంచి బయటపడుతుందని తెలిపారు. అన్ని మతాల ప్రార్థనా స్థలాలైన మందిరాలు, చర్చిలు, మసీదులు, ఈద్గా మైదానాలు, శ్మశాన వాటికల వద్ద గల ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలని కోరారు. నాటిన మొక్కలు పెరిగి ప్రార్థన స్థలాలకు సరిహద్దు కంచెగా ఏర్పడి అట్టి స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు. జిల్లాలో 73 నర్సరీలలో దాదాపు 1.50 కోట్ల రకరకాల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. 90 లక్షల టేకు మొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలను నర్సరల నుండి పొందవచ్చని అన్నారు. 100 కంటే ఎక్కువ మొక్కలు నాటిన సంరక్షణకు ఐదు రూపాయల చొప్పున చెల్లిస్తామని, వెయ్యి మొక్కలు నాటితే ఆ మొక్కల సంరక్షణకు సంరక్షకుడిని నియమించి రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వం నుంచి జీతం చెల్లిస్తామని వివరించారు. మొక్కలను ఉచితంగా అందజేస్తామని, ఎక్కువ మొత్తంలో మొక్కలు అవసరమైతే రవాణ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. నాటిన మొక్కలలో కనీసం 50 శాతం మొక్కలు బతికితేనే ఉద్యోగికి జీతం చెల్లిస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో మొక్కలు నాటేందుకు ఫీల్డ్ ఆఫీసర్లు, గ్రామ కార్యదర్శులు అన్ని విధాలా సహకరిస్తారని చెప్పారు. ఇంటి ముందు, పరిసరాల్లో మొక్కలు నాటుకునేందుకు అవసరమైన పూల మొక్కలు, కరివేపాకు, తులసి, జామ, మామిడి రకాల మొక్కలను అందుబాటులో ఉంచామని అన్నారు. రేపటి తరాల కోసం నేడు మొక్కలు నాటితే అవి పెద్దవై మనకు ప్రాణవాయువును అందిస్తాయని, అధికారులతో పాటు ప్రజలందరు సహకరించి పెద్ద మొత్తంలో మొక్కలు నాటాలని కోరారు. సమావేశంలో కేంద్ర సచివాలయ ప్రత్యేక అధికారి మహాలింగం, వేణుమాధవ్ పాల్గొన్నారు.

బాబుల్‌రెడ్డినగర్‌లో కార్డెన్ సెర్చ్
రాజేంద్రనగర్, జూలై 11: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ పద్మజా రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్‌ల ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బాబుల్‌రెడ్డినగర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పత్రాలు లేని 49 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, కారు స్వాధీనం చేసుకున్నారు. 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డీసీపీ పద్మజా రెడ్డి, ఏసీపీ అశోక్ మాట్లాడుతూ నగర శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్పారు. మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.