హైదరాబాద్

మోతాదు మేరకే క్రిమిసంహారక మందుల వాడకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూలై 13: పంటలపై సరైన మోతాదులో క్రిమిసంహారక మందులు వాడకంపై రైతులలో అవగాహన కల్పించడం ఎంతో అవసరమని భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఏడీజీ (క్రాప్ ప్రొటెక్షన్ బయోసేఫ్టీ) డాక్టర్ పీకే చక్రవర్తి అన్నారు. శుక్రవారం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన క్రిమిసంహారక మందుల అవశేషాల అఖిల భారత నెట్‌వర్క్ ప్రాజెక్ట్ 26వ వార్షిక సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి సంయుక్తంగా సదస్సును ఏర్పాటు చేశాయి. ప్రజల ఆరోగ్యంపై నష్టం కలిగించని విధంగా క్రిమి సంహారక మందులవాడకం ఉండేలా రైతులకు తెలియజేయాలని అన్నారు. పంటలపై పిచికారి చేస్తోన్న మందులలో కేవలం పది శాతం మాత్రమే పంటలపై ప్రభావం చూపుతుండగా, 90 శాతం పర్యావరణంలో కలిసిపోయి, కాలుష్యానికి కారణమవుతుందని, దీనిపై శాస్తవ్రేత్తలు దృష్టి నిలపాలని చెప్పారు. దేశంలో క్రిమిసంహారక మందుల కోసం లక్షా తొంబై వేల కోట్ల రూపాయలకుపైగా రైతులు ఖర్చు చేస్తున్నారని, దీన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లోకి ఆహార ధాన్యాలు ఎగుమతి అయ్యే విధంగా పంటల నాణ్యత ఉండేలాప్రొటోకాల్స్ రూపొందించాలని తెలిపారు. పంటలు కోసిన అనంతరం శుభ్రం చేసే అంశాలు, శుద్ధి చేసే అంశాలపై నూతన పద్ధతులను అమలు జరపాలని సూచించారు. సమావేశంలోప్రాజెక్టు వివరాలను నేషనల్ డైరెక్టర్ డాక్టర్ కేకే శర్మ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పంటలపై అవిచ్ఛిన్నంగా క్రిమిసంహారక వాడటంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, దీన్ని తగ్గించే ప్రయత్నం శాస్తవ్రేత్తలు చేయాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్ అన్నారు. కార్యక్రమంలో పలు ప్రచురణలను విడుదల చేశారు. డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ శర్మను సన్మానించారు. క్రిమిసంహారక మందుల అవశేషాల ప్రాజెక్టులో జరుగుతున్న కార్యక్రమాలను డాక్టర్ అనిత వివరించారు. పలు రాష్ట్రాల నుంచి శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు.

అంకితభావంతో పని చేయాలి
హైదరాబాద్, జూలై 13: ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ యోగితా రాణా హితవు పలికారు. నిజాయితీతో పనిచేసి, సాధించే ఫలితాలు ఉన్నత స్థాయిలో ఉండి, అనీర్వచనీయమైన ఆనందాన్నిస్తాయని కలెక్టర్ వివరించారు. బేటీ బచావో-బేటీ పడావో, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల నమోదు, సుకన్య యోజన పథకం, యువ మంచ్, బాలికామంచ్, బాలామృతం వంటి కార్యక్రమాలు, స్కీంల అమలు తీరును కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు చక్కటి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సీడీపీఓల స్థాయి నుంచి అంగన్‌వాడీ టీచర్ల వరకు అందరూ సమష్టిగా పనిచేసినపుడే ఆశించిన ఫలితాలు సాధించవచ్చునని అన్నారు. సీడీపీఓలు వారి క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఐదేళ్ల సంవత్సరాల పిల్లలందరిని లెక్కించి, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లని పిల్లలను, మూడు నుంచి ఆరు సంవత్సరాల్లోపు పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కిశోర బాలికలను యువమంచ్ గ్రూప్‌లుగా చేసి, వారికి మంచి, చెడు స్పర్శల గురించి, లైంగిక వేధింపులకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండేలా అవగాహన పెంచాలని సూచించారు. ‘గో-రన్-టెల్’ అనే సూత్రాన్ని అనుసరించటాన్ని నేర్పించాలని అన్నారు. బాలికలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ వారి పరిరక్షణకు పూర్తిగా బాధ్యత తీసుకోవల్సిన బాధ్యత మహిళా శిశు సంక్షేమ శాఖదేనని వివరించారు. సీడీపీఓలు కార్యచరణ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డోర్ టు డోర్ సర్వే నిర్వహించి, పిల్లల ఆధార్ నెంబర్లతో సహా పూర్తి వివరాలు సేకరించి నివేదికలను సమర్పించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి సునంద మాట్లాడుతూ పిల్లలను కొత్తగా ఎన్‌రోల్‌మెంట్ చేసి ప్రతిరోజు అంగన్‌వాడీ సెంటర్‌కు హాజరయ్యేలా చూడాలని అన్నారు. గర్భిణులకు భోజనం, పిల్లలకు బాలామృతం సెంటర్లలోనే తినిపించేలా చూడాలని సూచించారు. దివ్యాదిశ డైరెక్టర్ ఫిలిప్స్ ఫాక్సో చట్టం గురించి వివరించారు. సమీక్షలో పోస్టల్ అధికారి కోటేశ్వర రావు, సంక్షేమ శాఖ అధికారి శైలజ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఇంతియాజ్ పాల్గొనగా, పోషణ అభియాన్ ద్వారా గర్భిణులకు, పిల్లకు ఇచ్చే పోషకాహారం, అనిమియా, ఇమ్యూనైజేషన్, డీవామింగ్, పెరుగుదల, బరువు వంటి అంశాలపై అంగన్‌వాడీ టీచర్లకు సవివరంగా వివరించారు.